S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/25/2016 - 03:03

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: త్రివిధ దళాధిపతులు శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, వైమానిక దళ ప్రధానాదికారి అరుప్ రాహా, నౌకాదళ ఉప ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కెపి సింగ్‌లు 7, లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా నగరంలో లేక పోవడంతో ఆయన ఈ సమావేశానికి రాలేదు.

09/25/2016 - 03:02

ముజఫరాబాద్, సెప్టెంబర్ 24: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఒక మినీ బస్సు నదిలో పడిపోయిన సంఘటనలో 23 మంది మరణించారు. ముజఫరాబాద్‌కు 45 కి.మీ దూరంలో శుక్రవారంనాడు ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి 100 మీటర్ల కిందనున్న నదిలో పడిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో 23 మంది చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని వారు తెలిపారు.

09/25/2016 - 03:01

ఉజ్జయినీ (ఎంపీ), సెప్టెంబర్ 24: ఉజ్జయినీ సమీపంలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతులంతా కూలి పని చేసుకునేవారే. దేవాస్-ఉజ్జయినీ రోడ్డులో చందేసారా గ్రామానికి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న జీపు-ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌పి మనోహర్ వర్మ తెలిపారు.

09/25/2016 - 03:00

పనాజి, సెప్టెంబర్ 24: రెండు దేశాలూ అణ్వస్త్రాలను కలిగి ఉన్నందున భారత్‌కు పాకిస్తాన్‌తో యుద్ధం అనేది చివరి ప్రత్యామ్నాయం కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సూచించారు. కాశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడానికి భారత్ అన్ని రకాలుగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.

09/25/2016 - 02:54

టీవీ షోలు, బాలీవుడ్ సినిమాల్లో నటించి కమెడియన్‌గా గుర్తింపు పొందిన రాజు శ్రీవాత్సవ్ ఉరీ దాడులకు నిరసనగా తన కరాచీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్‌లో అతడి షోలకు మంచి ఆదరణ ఉంది. త్వరలో అక్కడ కొన్ని వినోద కార్యక్రమాల్లో రాజు పాల్గొనాల్సి ఉంది. ఇటీవల కాశ్మీర్‌లో ఉరీ సెక్టార్‌లో భారత సైనిక శిబిరంపై తీవ్రవాదులు చేసి 18మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.

09/25/2016 - 02:47

కోజికోడ్, సెప్టెంబర్ 24: ‘మీ సవాలును నేను స్వీకరిస్తున్నా. పాకిస్తాన్‌తో యుద్ధం చేయటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగా ధైర్యం ఉంటే, పోరాట పటిమే ఉంటే పేదరికంపైనా, నిరుద్యోగంపైనా, నిరక్షరాస్యతపైనా ఎందుకు పోరాటం చేయరు? ఆ పోరాటంలో భారత్, పాకిస్తాన్‌లలో ఎవరు గెలుస్తారో చూద్దాం’... భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్తాన్‌కు సూటిగా చెప్పిన మాటలివి.

09/25/2016 - 02:21

సూళ్లూరుపేట, సెప్టెంబరు 24: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుండి ప్రయోగించే పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ శనివారం ఉదయం 8:42 గంటలకు ప్రారంభమైంది.

09/24/2016 - 16:22

ఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అధికార దాహం ఏర్పడిందని, కేజ్రీవాల్ కేబినెట్‌లోని మంత్రులను వరుసబెట్టి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సామాజిక కార్యకర్త అన్నాహజారే శనివారం విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ పనితీరుకు తాను దు:ఖిస్తున్నానని, ఆమ్ ఆద్మీ పార్టీ దేశానికి మేలు చేస్తుందనుకోవడం తన తప్పన్నారు.

09/24/2016 - 14:11

దిల్లీ: జమ్ము-కాశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో భద్రత గురించి చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆర్మీ చీఫ్‌, వైమానిక దళాధిపతి, నేవీ వైస్‌ చీఫ్‌లతో సమావేశమయ్యారు. ఉగ్రవాదులు పాక్‌ నుంచి వచ్చినట్లు కొన్ని ఆధారాలు లభించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌ పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

09/24/2016 - 13:04

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, సాధారణ ఆహారం తీసుకుంటున్నారని వైద్యులు శనివారం వెల్లడించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులు శనివారం ప్రకటన విడుదల చేశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Pages