జాతీయ వార్తలు

సవాలుకు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజికోడ్, సెప్టెంబర్ 24: ‘మీ సవాలును నేను స్వీకరిస్తున్నా. పాకిస్తాన్‌తో యుద్ధం చేయటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగా ధైర్యం ఉంటే, పోరాట పటిమే ఉంటే పేదరికంపైనా, నిరుద్యోగంపైనా, నిరక్షరాస్యతపైనా ఎందుకు పోరాటం చేయరు? ఆ పోరాటంలో భారత్, పాకిస్తాన్‌లలో ఎవరు గెలుస్తారో చూద్దాం’... భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్తాన్‌కు సూటిగా చెప్పిన మాటలివి. ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దొంగదాడి చేసి 18మంది సైనికులను బలి తీసుకున్న తరువాత ప్రధాని మోదీ మొట్టమొదటిసారి పాకిస్తాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరిక చేశారు. భారత్‌తో వెయ్యి సంవత్సరాలైనా పోరాటం చేస్తామంటూ పాకిస్తాన్ నేతలు పలికిన బీరాలు చూస్తుంటే వారింకా ఎక్కడ ఉన్నారో అర్థమవుతోందన్నారు. భారతీయ జనతాపార్టీ జాతీయ మండలి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మోదీ కోజికోడ్ బీచ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఉరీ దాడి తరువాత ప్రధానమంత్రి హోదాలో అతి తీవ్ర స్వరంతో పాక్‌ను హెచ్చరించారు. అంతే కాదు, పాక్ ప్రజలకు భారత ప్రజల పక్షాన హితవు చెప్పారు. ‘ఒకే ఒక్క దేశం లేకపోతే ఆసియా ప్రపంచాన్ని శాసించేది’ అని కుండబద్దలు కొట్టారు. భారత ప్రధాని నేరుగా, ప్రత్యక్షంగా పాకిస్తాన్‌పై ఈ స్థాయిలో నిప్పులు చెరగటం ఇదే మొదటిసారి. ‘ఉగ్రవాదులూ నా మాటలు వినండి. 18మంది భారత జవాన్లు ఆత్మత్యాగం చేసిన ఉరీ దాడిని భారత్ ఎప్పటికీ మరచిపోదు. వాళ్ల త్యాగం ఊరికే పోదని పాకిస్తాన్ నాయకత్వానికి విస్పష్టంగా చెప్తున్నా. భారత్ ఎప్పటికీ ఉగ్రవాదానికి తలవంచదు. దాన్ని ఓడించేదాకా విశ్రమించదు’’ అని మోదీ అన్నారు. ప్రధాని ప్రసంగం అంతా భావోద్వేగంతో సాగింది. ఆయన ప్రతి మాటా పాకిస్తాన్‌పై తూటాలా పేలింది. ‘ఆసియా ఖండంలోని దేశాలు 21శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంటే, పాకిస్తాన్ మాత్రం టెర్రరిజాన్ని తన భూభాగం నుంచి ప్రోత్సహిస్తోంది. అమాయకులను హతమార్చేందుకు కుట్ర చేస్తోంది. భారత్‌లోనే కాదు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో జరుగుతున్న టెర్రరిస్టు ఘటనల్లోనూ పాక్ పాత్ర ఉంది. ఆసియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద ఘటన జరిగినా సరే.. ఉగ్రవాదులు ఆ దేశానికి (పాకిస్తాన్)కు చెందిన వాళ్లైనా అయి ఉంటారు. లేదా ఒసామా బిన్ లాడెన్ మాదిరిగా వేరే దేశం నుంచి వచ్చి అక్కడ ఉంటున్న వాళ్లైనా అవుతారు. పాకిస్తాన్ ప్రజలారా, రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ భారత్ సాఫ్ట్‌వేర్‌ను ఎగుమతి చేస్తుంటే, పాకిస్తాన్ ఎందుకు టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తోందో మీ నేతల్ని అడగండి’ అని సూటిగా ప్రశ్నించారు.
అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరి చేసే ప్రయత్నంలో చాలావరకు సక్సెస్ అయ్యామని మోదీ సూచన ప్రాయంగా చెప్పారు. గత కొద్ది రోజులుగా సీనియర్ మంత్రులు, ఆర్మీ అధికారులు, పార్టీ సీనియర్ నేతలతో వరుసగా చర్చలు జరుపుతున్నామని, అయితే ఉరీ ఘటనపై భారత్ ప్రతిస్పందన ఏ రూపంలో ఉంటుందనేది నేరుగా చెప్పలేనని మోదీ అన్నారు. ‘ఆసియాలోని ఈ ఒక్క దేశమే(పాకిస్తాన్) ఉగ్రవాదానికి మూలమని, ఉగ్రవాదులకు సురక్షిత స్థానమని ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి తెలుసు’ అని మోదీ అన్నారు. మన దేశంపై పదిహేడు సార్లు ఫిదారుూలు దాడులకు తెగబడ్డారు. 110మంది ఉగ్రవాదులను మన వీర జవానులు తుదముట్టించారు అని మోదీ చెప్పారు. ‘ఉగ్రవాదం మానవత్వానికే ప్రమాదమైంది. మానవతావాదులంగా ఐక్యమై ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది.’అని అన్నారు. ఉగ్రవాద దాడులతో భారత్‌లో శాంతి భద్రతలపై వచ్చిన వదంతులను మోదీ కొట్టిపారేశారు. ‘్భరత్ అత్యంత సురక్షితమైంది. 125కోట్ల మంది ప్రజలు తమ జవాన్లు, భద్రతా బలగాల వీరోచితమైన చర్యలను చూసి గర్వపడుతున్నారు. ఇలాంటి ఉగ్రవాద ఘటనలను విజయవంతంగా తిప్పి కొడుతున్న వీరసైనికులకు శాల్యూట్ చేస్తున్నారు’ అని అన్నారు. ‘పాకిస్తాన్ ఒక్క ఘటనలో 18మంది జవాన్లను దొంగదెబ్బ తీసి చంపింది. ఒకవేళ మిగతా 17 ఘటనల్లోనూ ఇదే విధంగా విజయవంతమై ఉంటే ఎంత వినాశనం అయ్యేదో ఊహించండి. మన జవాన్లకు ఆయుధాలు బొమ్మల్లాంటివి. అంతకంటే మించింది మన దేశ నైతిక స్థైర్యం చాలా గొప్పది.’ అని మోదీ అన్నారు. పాకిస్తాన్ పాలకులు టెర్రరిస్టులు రాసిన స్క్రిప్ట్‌లను చదువుతున్నారంటూ, ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘పాక్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్, గిల్గిత్‌లనే సరిగ్గా నియంత్రించలేని వారు, అంతే కాదు అంతకు ముందు బంగ్లాదేశ్‌ను సక్రమంగా తమ నియంత్రణలో ఉంచుకోలేని వారు,మాటిమాటికీ కాశ్మీర్ గురించి మాట్లాడి మిమ్మల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారో మీ నేతల్ని అడగండి’ అని పాకిస్తాన్ ప్రజలకు మోదీ నేరుగా సూచించారు. ‘పాక్ పాలకులు ఉగ్రవాదులు కాశ్మీర్‌పై రాసిన పాటలు పాడుతున్నారు. పాక్ ప్రజలకు నేరుగా చెప్తున్నా, 1947కు ముందు మీ పూర్వీకులు భారత భూమికి శాల్యూట్ చేశారన్నది గుర్తించుకోండి.’ అని హితవు చెప్పారు.

చిత్రం.. కోజికోడ్‌లో బిజెపి నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు అందించిన గజమాలతో మోదీ