జాతీయ వార్తలు

భారత్ బాయ్‌కాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఉరీ ఉగ్రవాద దాడికి పాల్పడి 18మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్‌పై అన్ని విధాలుగా ఒత్తిడి పెంచే చర్యలను భారత్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించుకుని ఉరీ దాడి ఆధారాలను సాక్ష్యాలతో సహా భారత్ అందించింది. అలాగే ఇస్లామాబాద్‌లో నవంబర్‌లో జరుగనున్న సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరు కాకూడదని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక దేశం సృష్టించిన విపరీత పరిస్థితుల నేపథ్యంలో సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సు అర్థవంతంగా జరిగే అవకాశం లేదంటూ భారత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఓ సభ్య దేశం సీమాంతర ఉగ్రవాద దాడులను ప్రేరేపించడం, మరో సభ్య దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ప్రస్తుత సార్క్ చైర్మన్‌గా ఉన్న నేపాల్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో 19 సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కాలేమనీ తేల్చిచెప్పింది. సార్క్‌లోని కొన్ని సభ్య దేశాలు కూడా ఇస్లామాబాద్ సదస్సు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో గుర్తు చేసింది. ఇప్పటికే అఫ్గానిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్‌లు సార్క్ సదస్సుకు హాజరు కాలేమని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
ఇంతకంటే ఏమి కావాలి?
పాక్ హైకమిషనర్ బాసిత్‌ను పిలిపించుకున్న భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఉరీకి సంబంధించిన తిరుగులేని ఆధారాలను అందించారు. ఉగ్రవాదుల చొరబాటుకు సహకరించిన ఇద్దరు గైడ్‌లను స్థానికులు పట్టుకున్నారని తెలిపారు. అలాగే ఉగ్రవాద దాడి వెనుక ఉన్నవారి వివరాలనూ బాసిత్‌కు అందజేశారు. భారత సైనికుల ప్రతిదాడిలో హతుడైన పాక్ మిలిటెంట్ హఫీజ్ అహ్మద్‌గా గుర్తించామని, అతడు పాకిస్తాన్‌లోని ముజాఫరాబాద్‌కు చెందిన వాడని ప్రాథమిక దర్యాప్తులో రుజువైందని బాసిత్‌కు ఆధారాల సహితంగా జైశంకర్ తెలిపారు. అలాగే ఉగ్రవాదులకు సహకరించిన మొహమ్మద్ కబీర్ అవాన్, బషారత్ వివరాలనూ అందించారు. భారత్‌పై దాడులు చేయడానికి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి ఒడిగట్టడాన్ని ఎంత మాత్రం సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు.