జాతీయ వార్తలు

నేడే నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 25: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వినూత్న ప్రయోగానికి సమయం ఆసన్నమైంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి సోమవారం ఉదయం 9:12 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి 8 ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఇందులో భాగంగా శనివారం ప్రారంభమైన కౌంట్‌డౌన్ సజావుగా సాగుతోంది. ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ ఆదివారం షార్ కేంద్రానికి చేరుకున్నారు. షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్, శాస్తవ్రేత్తలతో కలసి ఆయన ప్రయోగ వేదిక పైనున్న రాకెట్‌ను సందర్శించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగంపై చర్చించారు. కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా ఆదివారం ఉదయం రాకెట్‌లోని రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. సాయంత్రం ఆరు గంటలకు హీలియం, నైట్రోజన్ గ్యాస్‌ను కూడా నింపారు. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన స్క్యాట్‌శాట్-1 ఉపగ్రహం, కెనడా, అల్జీరియా, అమెరికా దేశాలకు చెందిన 5 ఉపగ్రహాలతో పాటు మన దేశ విశ్వవిద్యాయాలు రూపొందించిన మరో రెండు బుల్లి ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఒక రాకెట్ ద్వారా ఉపగ్రహాలను రెండు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే విధంగా ఇస్రో శాస్తవ్రేత్తలు ఈ రాకెట్‌కు రూపకల్పన చేశారు. మొదట 730 కిమీ దూరంలో స్కాట్‌శాట్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విడిచిపెడుతోంది. మళ్లీ రాకెట్ 50 కిమీ కిందకి తీసుకొచ్చి రాకెట్‌లోని నాలుగో దశలో ఇంజన్‌ను రెండుసార్లు ఆఫ్‌చేసి మళ్లీ స్టార్ట్ చేసి 680 కిమీ దూరంలో మిగిలిన 7 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చుతారు. ఈ రాకెట్ పయనం భూమి నుండి నింగికెగిరినానంతరం 2:15 గంటలపాటు సాగనుంది. ప్రపంచంలో ఏ దేశం ప్రయోగించని విధంగా ఈ ప్రయోగాన్ని ఇస్రో వినూత్నంగా రెండు గంటల పాటు చేపట్టే విధంగా పిఎస్‌ఎల్‌వి వాహక నౌకకు రూపకల్పన చేశారు. అన్నీ సజావుగా సాగితే రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఉదయం 9:12 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఉపగ్రహాల ఉపయోగాలు
స్కాట్‌శాట్-1: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రంలో ఇస్రో రూపొందించింది. ఈ ఉపగ్రహం బరువు 370 కిలోలు. ఈ ప్రయోగంలో ఇది ప్రధాన ఉపగ్రహం. సముద్ర గర్భంలో జరిగే మార్పులు, ఉపద్రవాలు, ప్రమాద హెచ్చరికలకు సంబంధించి అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది.
ప్రతమ్: ముంబయి ఐఐటికి చెందిన విద్యార్థులు రూపొందించిన ఈ ఉపగ్రహం బరువు 10 కిలోలు. ఎలక్ట్రికల్ సంబంధించిన సమాచారాన్ని లెక్కించి ఇస్రో సెంటర్లకు సమాచారాన్ని చేరవేయనుంది.
పైశాట్: 5.3 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని బెంగళూరు డిఈఎస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించారు. దీని ద్వారా ఎలక్ట్రికల్ పనితీరు మెరుగుపరుచుకోవచ్చును.
ఆల్‌శాట్-1బి: 110 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని అల్జీరియా దేశానికి చెందిన శాస్తవ్రేత్తలు రూపొందించారు. ఇదే కాకుండా 120 కిలోల బరువుగల ఆల్‌శాట్-2బి, 7 కిలోల బరువుగల ఆల్‌శాట్-1ఎన్ కూడా ఆ దేశానికి చెందినవే. వీటిని ఇస్రో వాణిజ్యపరంగా ఉపయోగించుకునేందుకు పంపిస్తున్నారు.
పాత్‌ఫైన్డర్: 50 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్షానికి చెందిన సంస్థ రూపొందించింది.
కెన్‌ఎక్స్-7: (ఎన్‌ఎల్‌ఎస్-19) 3.5 కిలోల బరువుగల ఈ ఉపగ్రహం కెనడా దేశానికి చెందింది. ఈ ఐదు విదేశీ ఉపగ్రహాలను ఇస్రో వాణిజ్య పరంగా విదేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకొనేందుకు ఈ వాహక నౌక ద్వారా పంపిస్తోంది.

చిత్రం.. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్