జాతీయ వార్తలు

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: పండుగ సీజన్ రానుండటంతో రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకతతో కూడిన వేతనాలను బోనస్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. ‘మేం ఉత్పాదకతతో కూడిన 78రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం. త్వరలోనే ఈ మేరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. ఒక్కో ఉద్యోగికి సగటున రూ.18వేల రూపాయలు బోనస్‌గా లభించవచ్చు’’ అని అఖిల బారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ఆదివారం తెలిపారు. బుధవారం జరగబోయే కేబినెట్ సమావేశంలో కేంద్ర మంత్రి మండలి దీనికి ఆమోదం తెలపవచ్చు దీని వల్ల కేంద్రంపై దాదాపు రెండు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. నాలుగేళ్లుగా ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇస్తోంది. అయితే నిరుడు కనీస బోనస్ పరిమితిని 3500నుంచి 7000కు పెంచటంతో రైల్వే ఉద్యోగులు ఈసారి రెట్టింపు బోనస్ తీసుకోనున్నారు.