జాతీయ వార్తలు

వాళ్లూ మనవాళ్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజికోడ్, సెప్టెంబర్ 25: ‘ముస్లింలు మనవాళ్లే, వాళ్లను ఓటుబ్యాంకుగానో, నిత్యావసర సరుకుల్లాగానో చూడవద్దు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముస్లింల ఎదుగుదలకు అంతా తోడ్పడాలి’ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రెండు రోజులుగా కేరళ లోని కోజికోడ్‌లో జరుగుతున్న భారతీయ జనతాపార్టీ జాతీయ మండలి సమావేశంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడైతే జాతీయభావనను ఒక వ్యతిరేక కోణంలో చూడటం మొదలైందో మైనారిటీల పట్ల వ్యవహరించటంపై తలెత్తిన ప్రశ్నలకు దీన్‌దయాళ్ పరిష్కారం చూపించారన్నారు. ‘‘ముస్లింలను చిన్నచూపు చూడవద్దు. ఓటుబ్యాంకులుగా, వినియోగ వస్తువులుగా భావించవద్దు. మనవాళ్లుగా భావించాలి. మనలో ఒకరిని చేసుకోవాలని దీన్‌దయాళ్ చెప్పారు’ అని మోదీ వివరించారు. తమ ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ పేరుతో ముందుకు వెళ్తోందన్నారు. అణచివేతకు గురైన వారు ముందుగా అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ ప్రసంగంలో ప్రధానమంత్రి లౌకికవాదం, సంతులిత అభివృద్ధిచ ఎన్నికల సంస్కరణలు, పారిస్ పర్యావరణ ఒప్పందం వంటి వాటిపై ప్రసంగించారు. లౌకిక వాదం పేరుతో కేరళలో బిజెపి, ఆరెస్సెస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. కేరళలో జరుగుతున్న రాజకీయ హత్యలపై రచించిన ఆహుతి పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
అక్టోబర్ 2న పారిస్ ఒప్పందానికి ఆమోదం
ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న పారిస్ పర్యావరణ మార్పు ఒప్పందానికి జాతిపిత మహాత్మాగాంధీ జయంతి(అక్టోబర్ 2)న భారత్ ఆమోదం తెలుపుతుందని ప్రధాని హఠాత్తుగా ప్రకటించారు. ‘‘ ఇంకా ఒక పని మిగిలి ఉంది. సిఓపి21(కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) రాటిఫికేషన్ జరగాల్సి ఉంది. భారత్ కూడా ఈ ఒప్పందాన్ని రాటిఫై చేయాల్సి ఉంది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజున నేను ప్రకటిస్తున్నా. అక్టోబర్ 2న పారిస్ నిర్ణయాలను రాటిఫై చేస్తాం. కనీస కర్బన ఉద్గారాలకు మహాత్మాగాంధీ జీవితం ఒక ఉదాహరణ. హరిత వాయువుల ప్రభావాన్ని తగ్గించేందుకు, వాతావరణ కాలుష్యం వల్ల అల్లాడిపోతున్న పేద దేశాలకు ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు ట్రిలియన్ల కొద్దీ డాలర్ల నిధులను అందించాలన్న లక్ష్యాలకు 190దేశాలు అంగీకారం తెలిపాయ’ని మోదీ వివరించారు. కనీసం 55 దేశాలు ఆమోదించిన తరువాత పారిస్ ఒప్పందం అమల్లోకి వస్తుంది.
ఎన్నికల సంస్కరణలకు వేళయింది
ఎన్నికల్లో పెద్ద ఎత్తున పారుతున్న ధనప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం, ఇతర సంస్కరణలు చేపట్టే అంశాలపై సంప్రతింపులు జరపాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ అన్నారు. ‘‘ ఎన్నికల సంస్కరణలకు సమయం ఆసన్నమైంది. ఇప్పుడున్న ఎన్నికల విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో లోపాలను సరిచేయాలి, డబ్బు పాత్ర ఎంత ఉంది? ప్రభుత్వ యంత్రాంగం పాత్ర ఏమిటి? పలు విధాల ఎన్నికల కారణంగా ఎన్నిరకాలుగా దేశంపై భారం పడుతోంది? అన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేయాల్సి ఉంది. ఎన్నికల సంస్కరణల వల్ల సామాన్య మానవుడి హక్కులు బలోపేతం కావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లు మరింత శక్తిమంతం కావాలి’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
శ్రీకంఠేశ్వరుడికి పూజలు
పార్టీ జాతీయ మండలి సమావేశంలో పాల్గొనేందుకు కోజికోడ్ వచ్చిన మోదీ, ప్రఖ్యాత శ్రీకంఠేశ్వరుడి ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దాదాపు పది నిమిషాల పాటు మోదీ ఆలయంలో గడిపారు.

చిత్రం.. కోజికోడ్‌లో ఆదివారం నిర్వహించిన బిజెపి జాతీయస్థాయ సమావేశంలో
మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ