జాతీయ వార్తలు

మంచినీటికే కావేరీ జలాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 23: కావేరీ జలాల వివాదం అనూహ్య మలుపు తిరిగింది. ఈ నదీ జలాలను కేవలం తాగునీటికి మాత్రమే వినియోగించాలంటూ కర్నాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. తమిళనాడుకు రోజుకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని వ్యవసాయ అవసరాల నిమిత్తం అందించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని అమలు చేయలేమని స్పష్టం చేసింది. శతాబ్దానికి పైగా కొనసాగుతున్న కావేరీ జలాల వివాదంపై కర్నాటక ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. తమ రాష్ట్రంలోని ఆనకట్టల్లోనే నీటి పరిమాణం దారుణంగా ఉందని, ఇలాంటి సమయంలో మంచి నీటి అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు కావేరీ జలాలను విడుదల చేసే స్థితిలో లేమని ఆ తీర్మానంలో పేర్కొంది. కోర్టు తీర్పును అమలు చేయడం ఎంత మాత్రం సాధ్యంకాని అసాధారణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈ వివాదంపై శాసన సభ,మండలిలో రోజంతా జరిగిన చర్చ అనంతరం ఏకగ్రీవ తీర్మానం చేపట్టారు. అన్ని పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. కావేరీ పరీవాహక ప్రాంతాల మంచి నీటి అవసరాలే తాము తీర్చుకోలేని స్థితిలో ఉన్నామన్నారు.