జాతీయ వార్తలు

ప్యాకేజీకి చట్ట భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మూలంగా పదేళ్లలో కలిగే ప్రయోజనాలను కేవలం రెండేళ్లలో కల్పించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల ప్రకటించిన ప్యాకేజీకి వచ్చే కేంద్ర మంత్రివర్గం సమావేశంలో చట్ట భద్రత కల్పిస్తామని సిఎం చంద్రబాబుకు జైట్లీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. బుధవారం అరుణ్‌జైట్లీని ఆయన కార్యాలయంలో కలుసుకున్న చంద్రబాబు రాష్ట్ర సమస్యల గురించి చర్చించారు.
కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి కృష్ణా జలాల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటుచేసిన అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు చంద్రబాబు ఈరోజు ఉదయం ఢిల్లీకి వచ్చారు. ఆయన ఢిల్లీకి చేరుకున్న వెంటనే ముందుగా అరుణ్‌జైట్లీ వద్దకు వెళ్లటం గమనార్హం. ‘ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం. అందుకే ఈ రాష్ట్రం పట్ల తమకు ప్రత్యేక శ్రద్ధ ఉంది’ అని జైట్లీ ముఖ్యమంత్రికి మరోసారి వివరించినట్లు తెలిసింది. ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తే కలిగే ప్రయోజనం కంటే రెండున్నర రెట్లు ఎక్కువ సహాయం అందచేస్తామని జైట్లీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు చేసే ప్రతి విజ్ఞప్తిని ఎన్‌డిఏ ప్రభుత్వం గౌరవంతో స్వీకరించి ఆమోదిస్తుందని జైట్లీ చెప్పారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామంటూ గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతోప్రయాణం చేసే జర్మనీ బుల్లెట్ రైలును ఆంధ్రప్రదేశ్‌కు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని జైట్లీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. జైట్లీతో చంద్రబాబు సమావేశం ఆత్యంత సుహృద్భావ వాతావరణంలో జరిగిందని టిడిపి నేతలు చెప్పారు.

చిత్రం... జైట్లీకి శ్రీవారి పటాన్ని అందజేస్తున్న
సిఎం చంద్రబాబు