జాతీయ వార్తలు

ఆస్పత్రుల్లో అధికారుల నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ఆస్పత్రుల్లో అధికారులు రోగులపట్ల నిర్దయగా ప్రవర్తించడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మీర్జాపూర్ ఆస్పత్రిలో 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతున్న తన కోడలిని భుజాలపై మోసుకుపోవలసిన పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆ కథనాలపై తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలోని కొన్ని ఆస్పత్రుల్లో సరయిన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల రోగులు, వారికి సహాయంగా వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయని ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది. దీనిపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ప్రధాన కార్యదర్శి ద్వారా పంపిన ఆ నోటీసులో ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆదేశించింది. మీడియా కథనాల ప్రకారం ఈ నెల 4న ఒక యువతిని మీర్జాపూర్ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే 5 గంటలపాటు డాక్టర్లు ఎవరు కూడా ఆమెను పరీక్షించడానికి రాలేదు. ఆమెను ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో ఆమె మామ తన భుజాలపైనే ఆమెను లోపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది.