జాతీయ వార్తలు

సమన్వయ లోపానికి భారీమూల్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరీ, సెప్టెంబర్ 22: ఉరీ సెక్టార్‌లో భారీ భద్రతతో ఉండే సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడికి సెక్యూరిటీ గార్డు పోస్టుల మధ్య సమన్వయ లోపమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఈ కేసు విచారణలో ఇప్పటికే డాక్యుమెంటేషన్ పనిని పూర్తి చేసింది. దాడి జరిగిన ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించింది. ఉరీ సైనిక శిబిరానికి చాలా చోట్ల కంచె సరిగా లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని హజీపీర్ నుంచి సెప్టెంబర్ 16/17లలో మన దేశంలోకి చొరబడ్డారని, అక్కడికి దగ్గర్లోనే ఉన్న సుఖ్‌దర్ గ్రామంలో బసచేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఉరీ సైనిక శిబిరం ఆనుపానులన్నింటినీ చూసేందుకు అనువైన గ్రామం సుఖ్‌దర్. ఉరీ క్యాంప్‌లోకి సైనికుల కదలికలన్నీ ఈ గ్రామం నుంచి స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది. పైగా ఈ ప్రాంతంలో దట్టంగా గడ్డి పెరిగి ఉండటం, పొదలు కూడా ఉండటంతో టెర్రరిస్టుల కదలికలు ఫెన్సింగ్ దగ్గరికి వచ్చిన తరువాత కూడా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది.
ఈ ప్రాంతంలోనే ఫెన్సింగ్‌ను కత్తిరించి ఉగ్రవాదులు సైనిక శిబిరం లోపలికి చొరబడ్డారు. కేవలం 150 అడుగుల దూరంలో ఉన్న రెండు సెక్యూరిటీ గార్డు పోస్టుల మధ్యలోనే ఈ ఫెన్సింగ్ కత్తిరించటంతో ఈ పోస్ట్‌ల మధ్య సమన్వయం లేకపోవటం ఒక కారణంగా ఎన్‌ఐఏ భావిస్తోంది. ఉగ్రవాదుల దాడి జరగటానికి 24 గంటల ముందు వరకు ఉరీ పట్టణంలో అన్ని సెల్‌ఫోన్‌ల కాల్ డాటాను, బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌ల డాటాను జమ్ము కాశ్మీర్ పోలీసులు సేకరించారు. ఈ డాటాను ఎన్‌ఐఏకు అందించారు. అంతే కాదు, మరణించిన ఉగ్రవాదుల డిఎన్‌ఏ నమూనాలను కూడా ఎన్‌ఐఏ సేకరించింది. స్థానిక ఇమామ్ సాయంతో ఉగ్రవాదుల మృతదేహాలను గ్రామ స్మశానంలో ఖననం చేశారు. ఉగ్రవాదుల నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇతర వస్తువులను చెక్కపెట్టెల్లో పెట్టి ఢిల్లీకి తరలించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న జిపిఎస్ పరికరాల్లోని డాటాను బయటకు తీసేందుకు కూడా ఎన్‌ఐఏ బృందం ప్రయత్నిస్తోంది.

చిత్రం.. నాలుగు రోజులుగా మూసివున్న ఉరీకి సమీపంలోని చెక్‌పోస్టును గురువారం మళ్లీ తెరిచారు. ఈ మార్గం గుండా వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న జవాన్లు