జాతీయ వార్తలు

పిఎస్‌ఎల్‌వి-సి 35 రిహార్సల్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 22: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టే పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన గురువారం చేపట్టిన రిహార్సల్స్ విజయవంతం అయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్‌కేంద్రం నుంచి ఈ నెల 26న ప్రయోగించే ఈ రాకెట్‌కు సంబంధించిన ప్రయోగాత్మక ప్రయోగాన్ని (రిహార్సల్) గురువారం షార్‌లో శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు. రాకెట్‌ను మోబైల్ సర్వీసు టవర్ నుండి బయటకు తీసుకొచ్చి మళ్లి మెల్లగా వెనక్కి తీసుకెళ్లె ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం స్కాట్‌శాట్-1, ఐఐటి బొంబాయి, బెంగుళూరు ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన ప్రాతమ్, పైశాట్ ఉపగ్రహాలతో పాటు అల్జీరియా దేశానికి చెందిన ఆల్‌శాట్-1బి, ఆల్‌శాట్-2బి, ఆల్‌శాట్-1ఎన్, కెనడాకు చెందిన కెన్‌ఎక్స్-7, యుఎస్‌ఎకి చెందిన పాత్‌పైన్‌డర్-1తో కలపి మొత్తం 8 ఉపగ్రహాలను ఒకేసారి పిఎస్‌ఎల్‌వి-సి 35 వాహక నౌక ద్వారా రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ 48గంటల ముందు అనగా శనివారం ఉదయం 9:12గంటలకు ప్రారంభకానుంది. కౌంట్‌డౌన్‌కు ముందు శాస్తవ్రేత్తలు ప్రీ కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాకెట్ ఒకటే అయిన ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్తవ్రేత్తలు ఈ ప్రయోగంతో వినూత్నంగా చేస్తున్నారు. 48గంటల పాటు కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 26న ఉదయం 9:12గంటలకు రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి దూసుకెళ్లనుంది.

చిత్రం.. ఉపగ్రహం చుట్టు హీట్‌షీల్డ్ అమర్చిన దృశ్యం