జాతీయ వార్తలు

ముంబయి తీరంలో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 22: ఉరీ ఘటన మరువకముందే ముంబయి తీరంలో మరో అలజడి చోటుచేసుకుంది. సైనిక దుస్తులు ధరించిన నలుగురు వ్యక్తులు ఉరాన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో అటు కోస్ట్‌గార్డ్, ఇటు మహారాష్ట్ర పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముంబయికి 47 కి.మీ దూరంలోని ఉరాన్, కరంజా ప్రాంతంలో సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు సంచరించడాన్ని నలుగురు పాఠశాల విద్యార్థులు గుర్తించి సమాచారం అందించారు. దీంతో ఉన్నతస్థాయి యంత్రాంగం అప్రమత్తమైంది. వారికోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే మహారాష్ట్ర పోలీసులతో కలిసి గాలింపు ముమ్మరం చేసినట్లు నావికాదళ చీఫ్ పిఆర్‌ఓ కెప్టెన్ డి.కె.శర్మ తెలిపారు. కాగా, ముంబయి, నవీ ముంబయి, థాణె, రాయ్‌గఢ్ తీర ప్రాంతాల్లో పశ్చిమ నావల్ కమాండ్ హైఅలర్ట్ ప్రకటించింది. అనుమానాస్పద వ్యక్తులను విద్యార్థులు గుర్తించారన్న సమాచారం అందగానే డిజిపి కార్యాలయం అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసింది. సున్నిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. గేట్‌వే ఆఫ్ ఇండియా, రాజ్‌భవన్, బాంబే హై, భాభా ఆటమిక్ రీసెర్చి సెంటర్, ఇతర ముఖ్య ప్రాంతాల్లో భద్రత పెంచారు. రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లను అప్రమత్తం చేసినట్లు డిజిపి సతీష్ మాధుర్ వెల్లడించారు. అనుమానితుల కోసం తీర ప్రాంత పోలీసుస్టేషన్ల సిబ్బంది, కోస్ట్‌గార్డ్ సిబ్బంది ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

చిత్రం.. ముంబయలో గురువారంనాడు తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు