S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/10/2017 - 00:17

కుక్కలను పెంచుకోవడం చాలామందికి ఇష్టం. రక్షణకోసం, ఆనందం కోసం, కాలక్షేపం కోసం వాటిని పెంచుకుంటారు. వాటి పెంపకం ఖర్చుతో కూడినదే. పైగా వాటి ఆలనాపాలనా శ్రమతో చేయాల్సినదే. అత్యుత్తమ జాతికి చెందిన శునకాలను కొనడమూ అందరికీ వీలుకాదు. నిజానికి విశ్వాసానికి, స్నేహానికి మారుపేరుగా నిలిచే శునకాలవల్ల ఒక్కోసారి ఇబ్బందులూ ఎదురవుతుంటాయి.

07/10/2017 - 00:15

ఢిల్లీ నుండి రోహ్‌తక్‌కు ప్రతిరోజూ వేలాది మంది టూరిస్టులు ప్రయాణం చేస్తుంటారు. అందమైన రోహ్‌తక్‌ను చూసేందుకు వాళ్లంతా ఉవ్విళ్లూరుతుంటారు. అయితే అందమైన రోహ్‌తక్‌కి వెళ్లేలోగానే ఢిల్లీ రోహ్‌తక్ హైవేపై వారికొక వింత ప్రకటన కనిపిస్తుంటుంది.

07/10/2017 - 00:10

మగధ దేశపు రాజుకి ఒకసారి విషజ్వరం సోకి ఎన్ని మందులు వాడినా తగ్గక మంచాన పడ్డాడు. రాజవైద్యుడు మందులు మార్చి, మార్చి వైద్యం చేస్తున్నాడు. కాని ఫలితం కనిపించడం లేదు. రాజు రోజురోజుకి నీరసపడుతున్నాడు. అప్పుడు మహామంత్రి ‘అంతుపట్టని రాజుగారి రోగాన్ని గుర్తించి వైద్యం చేసి రాజును సంపూర్ణ ఆరోగ్యవంతుని చేసిన వారికి లక్ష వరహాలు బహుమతిగా ఇయ్యబడతాయి’ అని ప్రకటించాడు.

07/08/2017 - 23:56

ఆ గ్రామంలో మోషేప్లోమో మంచి వ్యాపారి. ఆయన భార్య రివ్కా. ఇద్దరూ దైవభక్తులు. సహృదయులు. ఎన్నో ధార్మిక సంస్థలకు ఎన్నో దానధర్మాలు చేసేవాళ్లు. అందరికీ వాళ్లంటే ఎంతో అభిమానం.

07/08/2017 - 23:36

పురాణవేత్తయిన ఆ సుమంత్రుడు ప్రజలతో నిండి ఉన్న ఆ అంతఃపుర ద్వారాన్ని దాటి నిర్మానుష్యమైన వాకిలిని చేరుకున్నాడు. అక్కడ విల్లంబులు ధరించిన రాజభక్తిగల యువకులు ఏమరిపాటు లేకుండా మనసు లగ్నం చేసి కాపలా కాస్తున్నారు. తెల్లటి దుస్తులని ధరించి, చక్కగా అలంకరించుకుని, చేతిలో బెత్తాలతో జాగ్రత్తగా ఉన్న వృద్ధ ద్వారపాలకులని చూశాడు. ఎప్పుడూ రాముడి క్షేమానే్న ఆలోచించే ఆ వృద్ధులు సుమంత్రుడ్ని చూడగానే లేచారు.

07/08/2017 - 23:31

ప్రశ్న: ఆహారంతో ఆరోగ్యం గురించి మీరు చెప్తున్న విషయాలు చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. నాదొక సందేహం. శాకాహారమూ వేడి చేస్తోంది కదా.. మాంసాహారం శాకాహారాలలో ఏది మంచిది?
-ప్రసాద్ జె.ఎస్. మచిలీపట్నం

07/08/2017 - 22:04

అవకాశాలు లేవని, అవకాశాలు రావడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అవకాశాలనేవి కొంతమందికి ఎక్కువగా వున్నా అందరికి వస్తాయి. అవకాశాలని అందిపుచ్చుకోవాలి. అదే విధంగా సృజనాత్మకంగా ఆలోచించి అవకాశాలు కల్పించుకోవాలి. అలాంటిదే ఓ సంఘటన మీకు చెప్తాను.

07/07/2017 - 23:53

అది యూదుల పవిత్రమయిన పండుగ. రబ్బీ పరిశుభ్రంగా స్నానం చేసి తాల్మడ్, తోరాల నుండి కొన్ని అధ్యాయాలు చదివి వాటి అంతరార్థాన్ని శిష్యులకు వివరించి పాటలు పాడి ప్రార్థనలు చేశాడు. శిష్యులు ఆ పండుగను ఆనందంగా గడుపుకుని సంతృప్తిగా భోజనాలు చేశారు. ఆహ్లాదకరంగా, అర్థవంతంగా ఆ రోజు గడిచినందుకు రబ్బీ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

07/05/2017 - 00:31

రాజమహేంద్రవరం దగ్గరగా వున్న ద్వారపూడిలో రంగయ్య ఒక హోటల్ నడుపుతున్నాడు. రుచికి శుచికి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఆ హోటల్‌కి మంచి పేరు వచ్చింది. రంగయ్య దగ్గర కాళిదాసు, మాణిక్యం అనే ఇద్దరు వంటవాళ్లు పనిచేసేవారు. వంట చేయడంలో వారిది అందెవేసిన చెయ్యి. ఏ కూరలైనా సరే బహు చక్కగా వండేవారు. రంగయ్య వారిని చాలా బాగా చూసుకునేవాడు. ఎప్పటికప్పుడు వారి జీతాలు పెంచేవాడు.

07/05/2017 - 00:30

మంచి అర్థంతో, బతిమాలుతూ చెప్పే సుమంత్రుడి మాటలు విన్న దశరథుడి విచారం ఇంకా పెరిగింది. ధార్మికుడు, శ్రీమంతుడు ఐన ఆ రాజు కొడుకుని గురించిన ఆలోచనతో సంతోషం నశించి, దుఃఖంతో ఎర్రబడ్డ కళ్లతో ఆ సారధిని చూసి ‘నీ మాటలతో నా మర్మస్థానాలని ఛేదిస్తున్నావు’ అని చెప్పాడు. జాలితో కూడిన ఆ మాటలు వినగానే, వాటిని చెప్పిన దీనుడైన దశరథుడ్ని చూసి సుమంత్రుడు నమస్కరించి కొద్దిగా దూరంగా జరిగాడు.

Pages