S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/04/2017 - 03:56

ఫ్రశ్న: శరీరాన్ని ఎండబెట్టాలని మీరొకచోట రాశారు. మనం రోజూ ఎండలోనే తిరుగుతుంటాం కదా.. ప్రత్యేకంగా ఎండలో కూర్చోవాలా? దానివల్ల ప్రయోజనం ఏమిటి?
-కె.సదారావు (రాజమండ్రి)
జ: ‘ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్’ అని శాస్త్రం చెప్తుంది. సూర్యుడు ఆరోగ్య కారకుడు. జీవ వైవిధ్యాన్ని సంరక్షించే ప్రకృతి శక్తుల్లో సూర్యభగవానుడు ముఖ్యుడు. ఆయన శక్తుల్ని మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం అన్నది ప్రశ్న.

06/25/2017 - 21:12

ప్రతిరోజూ ఏదో చేయాలని అనుకుంటాం. రోజు చివరికి వచ్చే వరకు ఏమీ సాధించలేక నిరుత్సాహపడుతాం. అక్కడితో ఊరుకోం. ఆ పనులు చేయలేక పోవడానికి కారణాలు వెతుకుతాం. ఏవో సాకులు చూపించి చేయలేక పొయ్యామని మనకు మనం తృప్తిపడతాం. ఇతరులని తృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తాం.

06/24/2017 - 23:47

రాజులందరూ చెడ్డవాళ్లని అందర్నీ ఒకే గాట కట్టెయ్యలేం. కొందరు దుర్మార్గులుంటారు. కొందరు మంచివాళ్లుంటారు. ప్రజల్ని పట్టించుకోని స్వార్థపరులుంటారు. అధికారం చెలాయించే అహంకారులుంటారు, ప్రజల కష్టసుఖాల్ని పట్టించుకునే పాలకులు ఉంటారు. ఆదుకునే ధర్మప్రభువులూ ఉంటారు.

06/24/2017 - 23:01

ఎలాంటి అనుమానం లేకుండా కైకేయి ఈ విధంగా ప్రేరేపించడంతో, ఇంద్రుడు ప్రయోగించిన పాశాన్ని ఓ రాక్షసుడు విడిపించుకోలేనట్లుగా దశరథుడు ఆ ఉచ్చులోంచి విడిపించుకోలేక పోయాడు. కాడికి, చక్రానికి మధ్య నలిగిపోయే ఎద్దులా దశరథుడి హృదయం నలిగిపోయింది. మొహం పాలిపోయింది. దుఃఖంగా ఉన్న కళ్లతో ఏమీ చూడలేక పోయాడు. ఆ స్థితిలో అతి కష్టం మీద ధైర్యం తెచ్చుకుని కైకేయితో ఇలా చెప్పాడు.

06/24/2017 - 22:58

‘డాడీ!.. నాకు ఇవాళే క్రికెట్ కిట్ కావాలి’ స్కూల్ నుంచి రాగానే ట్యూషన్‌కి కూడా వెళ్లి వచ్చాక అడిగాడు ఏడవ తరగతి చదివే బన్నీ.

06/24/2017 - 22:57

కృషి, నిబద్ధత, పట్టుదల, ఏకాగ్రత ఉంటే మనిషి సాధించలేనిది లేదు. ఓర్పుతో ఎంత కష్టమైన పనినైనా ఇట్టే చేసి చూపించవచ్చు. అందుకు చక్కటి ఉదాహరణే రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన సురేంద్ర కుమార్ అపార్య. అతను ఎంతటి ప్రతిభావంతుడంటే బియ్యం గింజ మీద వందలాది అక్షరాలు రాయగలడు. సన్నని తల వెంట్రుక మీద బొమ్మలు వేయగలడు. ఇందుకు అతను చూపించే ఏకాగ్రత, పట్టుదల, నేర్పుని గమనించిన వారు ఔరా అనకతప్పదు.

06/24/2017 - 21:15

ప్రశ్న: బజార్లో దొరికే ఆలూచిప్స్, ఇతర వేపుడు వంటకాలను తినవచ్చా?
-జె.దినకర్ (జగిత్యాల)
జ: చావుకు పెడితే గానీ లంఖణానికి రారని ఒక సామెత. చావు ఎవరికైనా ఎప్పుడైనా తప్పదు. కానీ, రేపెప్పుడో వచ్చేదాన్ని ఇప్పుడే తెచ్చుకునే పనులు మనం చేస్తున్నపుడు హెచ్చరించాల్సిన బాధ్యత వైద్య సమాజానికుంది. ఆలుదుంపల వేపుడు ఇష్టంగా తింటున్నప్పుడు దాని గురించి నిజాలు తెలుసుకోవటం అవసరం కూడా.

06/24/2017 - 21:09

ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన ఈ సంవత్సరం కథల పోటీ ఫలితాలు ఇవి:

06/22/2017 - 23:30

మన గురించి ఇతరులు తెలుసుకోవాలంటే మన స్నేహితులెవరో తెలియాలి. అదే విధంగా మనం చదివే పుస్తకాలేమిటో కూడా తెలియాలి. ఇవి చాలా కాలం నుంచి విన్పిస్తున్న మాటలు.

06/18/2017 - 22:56

గుడికి హరికథ వినడానికి వెళ్లబోయే ముందు ఆశే్లష ఆయన చెప్పబోయే సర్గలని రెంటిని చదువుకుని బయలుదేరాడు.
ఆ రోజు ఆయన కథని ఇలా మొదలెట్టాడు.

Pages