AADIVAVRAM - Others

ఎండతోనే ఎముకలకు నిండుదనం (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: శరీరాన్ని ఎండబెట్టాలని మీరొకచోట రాశారు. మనం రోజూ ఎండలోనే తిరుగుతుంటాం కదా.. ప్రత్యేకంగా ఎండలో కూర్చోవాలా? దానివల్ల ప్రయోజనం ఏమిటి?
-కె.సదారావు (రాజమండ్రి)
జ: ‘ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్’ అని శాస్త్రం చెప్తుంది. సూర్యుడు ఆరోగ్య కారకుడు. జీవ వైవిధ్యాన్ని సంరక్షించే ప్రకృతి శక్తుల్లో సూర్యభగవానుడు ముఖ్యుడు. ఆయన శక్తుల్ని మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం అన్నది ప్రశ్న.
సూర్యుడు రాని రోజుని దుర్దినం అంటారు. శరీరానికి ఎండ తగలని రోజు కూడా మానవాళికి దుర్దినమే!
ఏ ఇంట్లో పగటిపూట కూడా లైట్లు వేసుకుంటున్నారో ఆ ఇంట్లో వాళ్ల మీద సూర్యుడి దయ ప్రసరించదు. వారికి ఎముకల వ్యాధులు, కీళ్లవాతం, గుండె జబ్బులు, కంటి జబ్బులు అధికంగా ఉంటాయని అర్థం. తెల్లవారుజామునే లేచి మైళ్ల పర్యంతం నడిచినా, సూర్యోదయానికి ముందే ఇంటికి చేరే వాళ్లకు సూర్యుడి దయ ఎంత మాత్రమూ కలగదు. ఏసీ గదుల్లో నివసిస్తూ, ఏసీ కారుల్లో తిరుగుతూ ఏసీ కార్యాలయాల్లో పనిచేసే వారిక్కూడా సూర్యుడి దయ దక్కదు. కరెంటు లైట్లలో మనం బతుకుతున్నంత మాత్రాన వెలుతురులో జీవిస్తున్నట్లు కాదు. సూర్యుడి కాంతి పడనిదంతా చీకటే! మనలో అధికులు అలాంటి చీకట్లోనే జీవిస్తున్నారు. ఇంట్లోంచి బయటకు రాకుండా అంతఃపురానికే పరిమితమైన స్ర్తిలను ‘అసూర్యం పశ్య’లంటారు. ‘సూర్యకాంతి తగలని స్ర్తి’ అని దానర్థం. స్ర్తి పురుషులిద్దరూ సూర్య స్పర్శతో జీవిస్తున్నారా సూర్యుడితో నిమిత్తం లేకుండా జీవిస్తున్నారా అని ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా స్ర్తిలకు సూర్య స్పర్శ అవసరం ఎక్కువ.
సూర్యకాంతి తగలని జీవన విధానం, పిజ్జాల్లాంటి పోషక విలువలు లేని ఆహార పదార్థాలు తినటం ఈ రెండింటి వలన మనం ముఖ్యంగా ‘డి’ విటమిన్ లోపానికి గురవుతున్నాం. అమెరికాలోని విచిత్రమైన వాతావరణ పరిస్థితుల రీత్యా అక్కడ జనాభాలో నాలుగో వంతు ప్రజలు డి విటమిన్ లోపానికి గురవుతున్నారని నివేదికలు చెప్తున్నాయి. ఎక్కువ ఎండాకాలం, తక్కువ ఎండాకాలం తప్ప మరొక ఋతువు తెలియని తెలుగు నేల మీద అపార్ట్‌మెంట్ల సంస్కృతి, అశాస్ర్తియమైన ఇళ్ల నిర్మాణాల కారణంగా ప్రకృతి సహజమైన గాలి, వెలుతురులకు దూరం కావటం వలన మనలోనూ నాలుగో వంతు ప్రజలు ‘డి’ విటమిన్ లోపానికి గురవుతున్నారు.
మన శరీరానికి రోజుకు 700 యూనిట్లు విటమిన్-డి అవసరం అవుతుంది. అది మన ఆహారం ద్వారా మనం బాగానే పొందవచ్చు. డి విటమిన్ అనేది కొవ్వులో కరిగే విటమిన్. అది శరీరంలో తయారవ్వాలంటే శరీరానికి తగినంత ఎండ తగలాలి. ఎండ తగలకుండా డి విటమిన్ మాత్రలు ఎన్ని మింగినా ప్రయోజనం ఉండదు. డి విటమిన్ వలన ఆహారంలోని కాల్షియం శరీరానికి వొంటబట్టి, ఎముక పదార్థాలు బలంగా తయారౌతాయి. ఎముక పుష్టి ఉండాలంటే కాల్షియం కావాలి. కాల్షియం వొంటబట్టాలంటే డి విటమిన్ కావాలి. డి విటమిన్ శరీరానికి అందాలంటే ఎండ తగలాలి. శరీరాన్ని మధ్యమధ్య ఎండబెట్టకపోతే ఎముకలు మెత్తబడిపోతాయి.
ఎండ, డి’ విటమిన్లు కలిసి అందటం వలన ఎముకలతోపాటుగా కండరాలు కూడా సుసంపన్నం అవుతాయి. శరీరంలో వ్యాధి నిరోధక యంత్రాంగం బలపడుతుంది. జీవన క్రియలు వేగవంతం అవుతాయి. కొత్త కణాల వృద్ధి జరుగుతుంది. కీళ్లలో ఏర్పడే వాపులు తగ్గుతాయి. రక్తపోటు అదుపులోకి వస్తుంది.
జీర్ణాశయ వ్యవస్థ బలహీనంగా ఉండి జఠరాగ్ని మందగించిన వారికి ఆహారం ద్వారా డి విటమిన్, కాల్షియంలు చాలినంత అందకపోవచ్చు. ఎండకు తోడుగా జఠరాగ్ని బలం కూడా తోడైతేనే ఎముక పుష్టి కలుగుతుంది.
20 శ్ఘశ్యఘూౄఒ/ ౄజజఆళూ (శ/ౄజ) కన్నా తగ్గితే ఢి విటమిన్ లోపం ఏర్పడినట్టు లెక్క. ఎముక పుష్టి తగ్గిందంటే, విటమిన్లు లేని ఆహారం తీసుకోవటం గానీ, విటమిన్లు వొంటబట్టేలా చేసే శరీర యంత్రాంగం సరిగా పనిచేయక పోవటం గానీ, ఎండ తగినంత తగలకపోవటం కానీ కారణాలౌతాయి. ఈ మూడు సమస్థితిలో ఉండేలా ఎవరికి వాళ్లే జాగ్రత్త తీసుకోవాలి. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాల్లో సూర్యకాంతి ద్వారా మనకు ఉపయోగపడే అతినీల లోహిత (అల్ట్రా వయొలిట్) కిరణాలను శోషించబడి ఎండ లోపం ఏర్పడవచ్చు కూడా!
కొవ్వులో కరిగే స్వభావం ఉన్నప్పటికీ, శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండే స్థూలకాయుల్లో డి విటమిన్ తక్కువగా వొంటబడ్తుందని పరిశోధకులు చెప్తున్నారు. వీళ్లు ఉదయం లేదా సాయంత్రం నీరెండగా ఉన్నప్పుడు తగినంత నడక లేదా వ్యాయామం చేయటం మంచిది. వయసు పెరిగే కొద్దీ డి విటమిన్ వొంటబట్టడం తగ్గుతూ వస్తుంది. రిటైరయ్యాక ఇంటికే పరిమితం కావటం స్ర్తి పురుషులిద్దరికీ మంచిది కాదు. ఎండ తగినంత తగిలేలా జాగ్రత్త తీసుకోవాలి.
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, అల్సర్లు, అమీబియాసిస్, పేగులలో వాపు, ఇలంటి జీర్ణకోశ దీర్ఘ వ్యాధుల్లో డి విటమిన్ వొంటబట్టక పోవటం వలన ఎముకలు మెత్తబడే పరిస్థితి రావచ్చు. పేగులను బలసంపన్నం చేసేందుకు ఆయుర్వేద వైద్యుల సలహాని కూడా పొందటం మంచిది. మూత్రపిండాలు, లివర్ వ్యాధుల్లో కూడా ఇలాంటిదే జరగవచ్చు. కీళ్లవాతం, కీళ్లలో ఎముకల వాపు ఇలాంటివి అన్నింటికన్నా ముందు కనిపించే లక్షణాలు ఈ వ్యాధిలో! కండరాలు బలహీనపడ్తున్నాయంటే డి విటమిన్ లోపం ఏర్పడుతున్నట్టే భావించాలి.
గర్భవతుల్లో విటమిన్ డి అవసరం ఎక్కువగా ఉంటుంది. తల్లి కడుపులో పెరిగే బిడ్డ ఎముక పుష్టికి తగినంత డి విటమిన్‌ని అందేలా చూడాలి. అందుకు తల్లి తగినంతసేపు ఎండలో కూర్చోవటం కూడా అవసరం. పుట్టిన తరువాత బిడ్డక్కూడా కొద్ది నిమిషాలు లేయెండ తగిలేలా చూడాలి. బిడ్డనెత్తుకొని తల్లి కొద్దిసేపు ఏ గుడికో, మార్కెట్టుకో వెళ్లి వస్తే తల్లీ బిడ్డలిద్దరికీ మంచిది.
సినిమా యాక్టర్లు, టీవీల్లో పదేపదే కన్పించే వాళ్లు ఎండలేమిటి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తులు కనీసం వరండా లేదా పోర్టికో వరకైనా ఎండ వచ్చే అవకాశం ఉన్న ఇంట్లో కొద్దిసేపు ఎండలో కూర్చోవటం మంచిది.
ఇది కేవలం ఎముకల సమస్యే కాదు. అనేక మానసిక సమస్యలు, నరాల సమస్యలకు కూడా డి విటమిన్ లోపం కారణమవుతుంది. అతిగా ఉద్రేకపడటం, క్షణానికో రీతిగా మనోభావాలను మార్చుకోవటం, ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాడిలా మూడీగా ఉండటం ఇలాంటి సమస్యలు కూడా డి విటమిన్ లోపం వలన కలుగుతాయి. ఆందోళన (యాంగ్జయిటీ), దిగులు (డిప్రెషన్) ఇవి రెండూ ఎండ ముఖం తెలీని వాళ్లలో పెరుగుతాయి. మంచానపడ్డ వాళ్లని కూడా ఆ మంచంతో పాటుగా కొద్దిసేపు ఎండలో ఉంచితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. బీపీ కంట్రోల్‌లో లేనివారు కొద్దిసేపు లేత ఎండలో వ్యాయామం చేస్తే బీపీ ఉపశమిస్తుంది. బీజదోషాలు ఏర్పడి సంతానం కలగకపోతున్న వారికి ఎండ సహకరిస్తుంది.
మన జీర్ణశక్తి, బలంగా ఉండాలి. మనం తగినంత ఎండ తగిలేలా జీవించాలి. విటమిన్లు పుష్కలంగా ఉండే బలవర్థక ఆహారం తీసుకోవాలి. ఈ మూడు జాగ్రత్తలూ తీసుకునే వారికి డి విటమిన్ సక్రమంగా అందుతుంది.
డి విటమిన్ మాత్రలు ఎవరికి వాళ్లు కొని వేసుకోవటం మంచిది కాదు. రక్తంలో డి విటమిన్ స్థాయిని చూశాక వైద్యుడు ఆ మాత్రలు వాడిస్తాడు. మీకు మీరు సరిచూసుకోవలసింది, పోషకవంతమైన, ఆరోగ్యదాయకమైన ఆహారం. శరీరానికి తగినంత ఎండ ఇవి రెండూ ఉంటే మనం ఆరోగ్యానికి భద్రత తెచ్చుకున్నట్టే!
మయూరుడనే ఒక రచయిత ఎండలో నిలబడి సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య భగవానుణ్ణి ఆరాధించి తన బొల్లి వ్యాధిని పోగొట్టుకున్నాడు. ఆ కృతజ్ఞతతో సూర్యశతకం రాసి ప్రసిద్ధి పొందాడు.
ఎంత చెప్పినా ఎండ వలన కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే! ఎండనిచ్చే సూర్య భగవానుణ్ణి మన శాస్త్రాలు ఆరోగ్యప్రదాత అని స్తుతించాయి. ఇది నిజం. పగలు ఇంట్లో సూర్యుణ్ణి వెలిగించండి.. ట్యూబులైట్లనో, ఎల్‌ఈడీ బల్బుల్నో కాదు.
**
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com