AADIVAVRAM - Others

వనరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజూ ఏదో చేయాలని అనుకుంటాం. రోజు చివరికి వచ్చే వరకు ఏమీ సాధించలేక నిరుత్సాహపడుతాం. అక్కడితో ఊరుకోం. ఆ పనులు చేయలేక పోవడానికి కారణాలు వెతుకుతాం. ఏవో సాకులు చూపించి చేయలేక పొయ్యామని మనకు మనం తృప్తిపడతాం. ఇతరులని తృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తాం.
ఈ సృషి,్ట సమయం విషయంలో మాత్రం అందరిని ఒకేలా చూసింది. అందరికీ ఒకే కాలాన్ని ఇచ్చింది. అందరికీ ఇచ్చింది 24 గంటలే. ఈ విషయంలో వర్గ, ప్రాంత, లింగ భేదాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే సమయాన్ని ఇచ్చింది. మనం ఇతర విషయాల్లో మన అసంతృప్తిని వెలిబుచ్చవచ్చేమో కానీ కాలం విషయంలో అసంతృప్తిని వెలిబుచ్చలేం.
ఇతరులతో పోల్చుకొని వాళ్లకి ఎక్కువ డబ్బుంది. వాళ్ల తల్లిదండ్రులు బాగా విద్యావంతులు. అతను నాకన్నా ఎక్కువగా చదువుకున్నాడు. నా కన్నా యువకుడు. నాకన్నా అతనికి ఎక్కువ అనుభవం ఉంది. ఇట్లా ఎన్నో సాకులని చెప్పవచ్చు. ఈ కారణాలు చూపిస్తూ మనం నిర్దేశించుకున్న గమ్యాలను చేరకపోవడానికి నెపాలుగా వాటిని చూపించవచ్చు.
జీవితంలో విజయం సాధించిన వ్యక్తులని గమనించినప్పుడు వాళ్ల వనరులని గమనించినప్పుడు వాళ్ల వనరులు మనకన్నా చాలా తక్కువగా కన్పిస్తాయి. ఈసారి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మూడవ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణనే తీసుకుందాం. ఎక్కడో శ్రీకాకుళం దగ్గరలోని చిన్న గ్రామం అతని స్వస్థలం. అతను చేస్తున్నది చాలా చిన్న ఉద్యోగం. చదివింది తెలుగు మాధ్యమం. ఏ కోచింగ్ సెంటర్ అతనికి అడ్మిషన్ ఇవ్వలేదు. అయినా అతను కష్టపడి చదివాడు. విజయం సాధించాడు. వనరుల మీద అతను నెపాన్ని వేయలేదు.
ఇతరులకి ఎన్నో వనరులు ఉన్నాయని తనకు ఆ వనరులు లేవని అతను నిందిస్తూ కూర్చోలేదు. తనకున్న వనరులని అతను పూర్తిగా వినియోగించుకున్నాడు. తనకి తానే వనరుగా మారిపోయాడు.
అంతేకాని తనకు వనరులు లేవని నిరాశ పడుతూ కూర్చోలేదు. నిందిస్తూ కూర్చోలేదు. మనకున్న గోల్స్ నిర్దేశించుకొని మన ప్రయత్నం మనం చేయాలి.
మనకున్న వాటితో మనం ప్రయత్నం చేస్తే మనమూ ఏదైనా సాధించగలం.
ప్రపంచంలో అందరికీ వున్నవి 24 గంటలే.
వనరులు ముఖ్యమే.
మనం వనరులుగా మారడం మరీ ముఖ్యం.

- జింబో 94404 83001