AADIVAVRAM - Others

అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవకాశాలు లేవని, అవకాశాలు రావడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అవకాశాలనేవి కొంతమందికి ఎక్కువగా వున్నా అందరికి వస్తాయి. అవకాశాలని అందిపుచ్చుకోవాలి. అదే విధంగా సృజనాత్మకంగా ఆలోచించి అవకాశాలు కల్పించుకోవాలి. అలాంటిదే ఓ సంఘటన మీకు చెప్తాను.
ఓ ఇద్దరు యువకులు మంచి మిత్రులు. వాళ్లిద్దరికి సినిమాల్లో నటించాలని చాలా కోరిక. అవకాశాలు లభించడం లేదని వాళ్లు ఎప్పుడూ బాధపడేవారు. ఓ మిత్రునితో ఇదే విషయం చెప్పారు.
లెక్కలేనన్ని అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవడం తెలియాలని ఆ మిత్రుడు వారికి సలహా ఇచ్చాడు. ఆ ఇద్దరి యువకుల్లో ఒకరికి ఆ విషయం అర్థమైంది. మరో యువకునికి అతను చెప్పిన విషయం అర్థం కాలేదు. అతను సినిమా స్టూడియోల చుట్టూ, దర్శకుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. కానీ అతనికి ఎవరూ అవకాశం ఇవ్వలేదు.
రెండో మిత్రుడు తన దగ్గర వున్న సెల్‌ఫోన్‌లో వున్న కెమెరాతో తన తమ్ముడి సహాయంతో చిన్నచిన్న ఎపిసోడ్‌లు తీయడం మొదలుపెట్టాడు. వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పెట్టాడు. మొదటగా అంతగా ఎవరూ పట్టించుకోలేదు. ఓ నాలుగు వారాల తరువాత కొంతమంది వాటిని చూడటం మొదలుపెట్టారు. అవి కొంతమంది దృష్టిని ఆకర్షించాయి కూడా. చివరికి ఓ సినిమా డైరెక్టర్ వాటిని చూడటం తటస్థించి అతనికి ఓ సినిమాలో అవకాశం ఇచ్చాడు.
అతనికి సినిమా ఛాన్స్ రావడం రోజూ స్టూడియోల వెంట తిరిగే అతడి మిత్రుడికి ఆశ్చర్యం వేసింది. ఎలా అవకాశం వచ్చిందని మిత్రుణ్ని అడిగాడు. అతడు జరిగింది జరిగినట్టు చెప్పాడు.
అక్కడితో ఊరుకోలేదు.
ఇంకా ఇలా చెప్పాడు.
‘మనకు అవకాశం ఎప్పుడు వస్తుందన్న ఆలోచనలో వుండకూడదు. మనకున్న అవకాశాలని ఎలా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాలి. నేను అలాగే ఆలోచించాను. నా సెల్‌ఫోన్‌తో చిన్నచిన్న ఎపిసోడ్‌లు తీసి యూట్యూబ్‌లో పెట్టాను. మూడు వారాలు నిరుత్సాహంగానే ఉంది. కానీ ఆ తరువాత కొంతమంది చూడటం ప్రారంభించారు. నా అదృష్టవశాత్తు నేను తీసిన ఓ ఎపిసోడ్‌లో నా నటన నచ్చి ఓ డైరెక్టర్ నాకు అవకాశం ఇచ్చాడు. నీ దగ్గర మంచి సెల్‌ఫోన్ ఉంది. దానితో చిన్నచిన్న ఎపిసోడ్స్ తీసి నువ్వు యూట్యూబ్‌లో పెట్టవచ్చు. అలా కాకుండా నీ ఎదుట వున్న అవకాశాలని పక్కన పెట్టి పరుగులు తీసావు. నేను నా ఎదుట వున్న అవకాశాలను ఉపయోగించుకున్నాను.’
మిత్రుడు చెప్పిన విషయం విన్న తరువాత అతని మిత్రునికి తను ఏం చేయాలో అర్థం అయ్యింది.
అవకాశాలను మనం సృష్టించుకోవాలి. ఉపయోగించుకోవాలి.

- జింబో 94404 83001