AADIVAVRAM - Others

పరోటా తింటే.. (లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ నుండి రోహ్‌తక్‌కు ప్రతిరోజూ వేలాది మంది టూరిస్టులు ప్రయాణం చేస్తుంటారు. అందమైన రోహ్‌తక్‌ను చూసేందుకు వాళ్లంతా ఉవ్విళ్లూరుతుంటారు. అయితే అందమైన రోహ్‌తక్‌కి వెళ్లేలోగానే ఢిల్లీ రోహ్‌తక్ హైవేపై వారికొక వింత ప్రకటన కనిపిస్తుంటుంది. అదేమిటంటే అతి పెద్దవైన మా మూడు పరోటాలు గనుక ఏభై నిముషాల్లో తింటే వారి పేరిట లక్ష రూపాయల ఇన్స్యూరెన్స్ కట్టడమే కాకుండా, అలా తిన్న వారికి జీవితాంతం పరోటాలు ఉచితంగానే ఇస్తామని.
చిత్రంగా కనిపించే ఆ ప్రకటనకు ఆకర్షితులయ్యే వారు అక్కడ కాసేపు ఆగి ఆ వైనం ఏమిటాని పరీక్షిస్తారు. తపస్య పరోటా సెంటర్ పేరుతో ఈ జంక్షన్‌లో నడిపే షాపు ఈ ప్రాంతానికే ఫ్యామస్. ఇక్కడికి రోజూ వందలాది మంది విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ దాదాపు ఏభై రకాల పరోటాలు లభ్యమవుతాయి. నేతితో తయారు చేయబడే ఈ పరోటాలు అత్యంత రుచికరంగా ఉండడంతో టూరిస్టులు ఎగబడి మరీ ఈ పరోటాలు తింటూ ఉంటారు.
ఒకటిన్నర అడుగులో గుండ్రని ఆకారంలో ఉండే ఒక్కొక్క పరోటాని తినడానికి ఎంతటి భోజన ప్రియులకైనా చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ కొంత మంది ఔత్సాహికులు ఈ షాపు వారి ఛాలెంజిని స్వీకరించి ఏభై నిముషాల్లో అతి పెద్దవైన మూడు పరోటాలు తినడానికి రెడీ అవుతుంటారు... ఓటమిని చవిచూస్తూ ఉంటారు. మహా అయితే ఒకటిన్నర పరోటా తిన్న తర్వాత వారంతా తమ వల్ల కాదని చేతులెత్తేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ షాపు పెట్టిన తర్వాత కేవలం ఇద్దరే ఏభై నిముషాల్లో మూడు పరోటాలు తిని ఛాలెంజిలో గెలిచారు. వారిలో ఒకతని పేరు అశ్వినికుమార్ అనే వ్యక్తి నలభై నిముషాల్లోను, మహరాజ్ అనే వ్యక్తి ఏభై నిముషాల్లోను మూడేసి పరోటాలు తిని ఈ పందెంలో గెలిచారు. వారి తర్వాత మళ్లీ ఎవరూ ఈ ఛాలెంజిలో గెలవలేదు. ఇక్కడ రోజుకి 150 వరకు పరోటాలు అమ్ముడవుతుంటాయి. ఇందుకుగాను వారు రోజుకి ఏభై నుండి అరవై కిలోల గోధమపిండి, ఏభై నుండి అరవై కిలోల బంగాళా దుంపలు, నలభై నుండి ఏభై కిలోల వరకు ఉల్లిపాయలు, రెండు నుండి మూడు కిలోల వరకు డ్రైఫ్రూట్స్ వినియోగిస్తుంటారు. పద్దెనిమిది అంగుళాల చుట్టు కొలతతో ఉండే ఈ పరోటాలు ఒక్కొక్కటి దాదాపు కేజీ బరువు తూగుతుంటాయి. ఇంత పెద్ద పరోటాలు తయారు చేయడం సులభం కాదు. వీటి కోసం ప్రత్యేకమైన కళాయిలు వినియోగిస్తుంటారు. ఈ పరోటాల తయారీ చూడడానికి కూడా టూరిస్టులు ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ ఆలూపియాజ్ పరోటా, ఆలూ గోబీ పియాజ్ పరోటా, పనీర్ పరోటా, పియాజ్ పనీర్ పరోటా, గోబీ పనీర్ పరోటా వంటివి ఇక్కడ రుచి పరంగా బాగుంటాయి. ఇండియాలోనే అత్యంత పెద్దవైన పరోటాలు తయారు చేసే ఈ షాపుని సందర్శించడం టూరిస్టులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంటుంది. ఢిల్లీ నుండి రోహ్‌తక్‌కి వెళ్లేలోగా టూరిస్టులకు ఇదొక అందమైన అనుభవంగా చెప్పవచ్చు. అతి పెద్ద మూడు పరోటాలు తినడానికి రెడీ అయ్యే ఔత్సాహికులు పోటీకి దిగగా, అక్కడికి చేరిన వారంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ పోటీదారుడిని ఉత్సాహపరడం, చివరికి ఏమవుతుందనే ఉత్సుకత నడుమ ఫలితం తేలడం అన్నీ ఈ ప్రయాణంలో వింత ఫీలింగుని కలిగిస్తాయని టూరిస్టులు చెబుతుంటారు.
*

- దుర్గాప్రసాద్ సర్కార్