S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

08/10/2017 - 20:42

ఈమధ్య ఎక్కడికి వెళ్లినా ఓ బోర్డు దర్శనం ఇస్తుంది. మీరు ఎలక్ట్రానిక్ పర్యవేక్షణలో వున్నారన్నది ఆ బోర్డు సారాంశం. అంటే నిఘా నేత్రం మనల్ని చూస్తుందన్నమాట.
రోడ్డు మీద యాక్సిడెంట్లు ఎలా జరిగాయో, ఎర్రలైట్ వుండగా దాన్ని క్రాస్ చేసిన వ్యక్తులని ఈ నిఘా నేత్రం ద్వారా తెలుసుకుంటున్నారు.

08/08/2017 - 22:04

మానవ శరీరంలో అన్ని అవయవాలలో కణజాలం దెబ్బతిన్నా తిరిగి ఏర్పడటం మామూలే. దెబ్బలు తగిలినా, కాలిన గాయాలైనా నాశనమైన కణజాలం ఎండిపోయి కొత్తగా మళ్లీ ఏర్పడి పాతరూపునకు ఆయా భాగాలు వస్తాయి. అయితే కంటిలోని రెటీనా మాత్రం అలా పునరుత్పత్తికాదు. అందుకే కళ్లకు గాయాలై రెటీనా దెబ్బతింటే ఇక చూపు సాధ్యపడదు.

08/08/2017 - 22:00

పిల్లలకూ భావోద్వేగాలుంటాయి. వారు కూడా తమ భావాలను వ్యక్తీకరించాలని, తమలోని మానసిక ఎత్తుపల్లాలను బహిర్గతం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. నిజం చెప్పాలంటే పిల్లల ప్రపంచమే వేరు. అది పెద్దల ప్రపంచం కంటే భిన్నమైనది. అందమైనది. మాటలతో వర్ణించడానికి అతీతమైనది. పిల్లలు తమ గురించి తాము చర్చించుకోవడానికి, ఒకరి అభిరుచులను మరొకరికి చెప్పుకోవడానికి ఇప్పటి వరకు సరైన వేదికంటూ లేదనే చెప్పుకోవాలి.

08/08/2017 - 21:55

ఆంగ్లంలో కొన్ని పదాలకు మామూలుగా ఒక అర్థం వస్తే, జీవశాస్త్ర పరిభాషలో మరొక అర్థం కూడా ఉంటుంది. మనం వాడే సందర్భాన్ని బట్టి ఆయా పదాల అర్థాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆంగ్లంలో Warren‘వారెన్’ అంటే కొన్ని రకాల ప్రాణులను ఉంచిన ఒక నిర్దేశిత స్థలంగా చెబుతారు. లేదా కుందేళ్లు నివాసం ఉండే కొన్ని బొరియలను కలపి ‘వారెన్స్’ అని పిలుస్తారు. కుందేళ్ల సమూహాన్ని కూడా అలా పిలవడం పరిపాటే.

08/08/2017 - 21:53

శివయ్య, రామయ్య ప్రాణమిత్రులు. ఇరుగుపొరుగునే ఉంటున్నారు. వ్యవసాయం వారి ప్రధాన వృత్తి. పెద్దగా చదువుకోలేదు. ఇరువురూ ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకుంటూ ఎంతో సఖ్యంగా ఉంటున్నారు. వారి సఖ్యతను చూసి ఊరి జనం స్నేహితులంటే ఇలా ఉండాలని అనుకుంటూ ఉంటారు.

08/06/2017 - 22:58

పెళ్లి కుదిరినా, పెళ్లికొడుకు తన మనసుకు నచ్చే రీతిలో డాన్స్ చేయలేదని అతడు ఊరేగుతూ వచ్చిన గుర్రం స్టెప్పులు మెచ్చుకుని, దానిని మనువాడిందా పెళ్లికూతురు! ఇది జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. చుట్టాలందరికీ పెళ్లికొడుకు నృత్యాభినయం వికారంగా అనిపించడంతో వాళ్లంతా మూతి విరిచారు. వీళ్లకే కాదండోయ్.. అసలా వధువుకి కూడా అతగాడి వరస రోత పుట్టించింది. వెంటనే ‘నాకీ పెళ్లిగిళ్లీ వద్దు. ఆ గుర్రం బాగా డాన్స్ చేస్తోంది..

08/06/2017 - 22:57

పెళ్లికి రెండ్రోజుల ముందే అకారణంగా దానిని రద్దు చేసుకున్న ఆ పెళ్లికూతురు అంతకు ముందు ఆర్డర్ ఇచ్చిన 170 ప్లేట్ల విందు భోజనాన్ని ఏం చేయాలో అర్థంకాక సతమతమైంది. వివాహం జరగకపోయినా పార్టీ ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది? అని నిర్ణయించుకుని చుట్టుపక్కల ఉన్న డజన్ల కొద్దీ ఇళ్లులేని పేదలను అదే రోజు విందుకు ఆహ్వానించింది.

08/06/2017 - 21:24

మనిషి పుట్టడం, పెరగడం, మరణించడం సహజంగా ప్రకృతిలో జరిగే విషయాలు. కాని మనిషి మరణించి మట్టిలో కలిసిపోవడాన్ని శివ జీర్ణించుకోలేక పోయాడు. పైగా సృష్టిలో ఎక్కడో మరణం లేని చోటు ఉంటుంది. తాను అక్కడికి వెళ్లి నిశ్చింతగా ఉండిపోవచ్చు అనుకున్నాడు. ఒకరోజు ఇంటి నుండి బయలుదేరాడు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎంత బతిమలాడినా వినలేదు.

08/06/2017 - 21:19

హరిదాసు కథని మొదలుపెట్టే ముందు చెప్పాడు.
‘రామాయణం మీద మీకు గల ఆసక్తికి సంతోషం. నిన్న అయోధ్య కాండ 21వ సర్గ దాకా చెప్పాను. ఇవాళ 23 సర్గ దాకా చెప్తాను’
తర్వాత గట్టి మనసు గల రాముడు ధైర్యంగా తన మనోభావాలని అణచుకుని, మానసిక దుఃఖం వల్ల దీనుడు, బాగా కోపం వచ్చి నాగుపాములా బుసకొట్టే వాడు, మంచి మనసు గలవాడు, కోపంతో కళ్లు పెద్దవైన ప్రియ తమ్ముడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్లి ఇలా చెప్పాడు.

08/06/2017 - 21:10

ఫ్రశ్న: నడుమునొప్పి తీవ్రంగా ఉంటోంది. మందులేమీ వద్దు. బెడ్‌రెస్ట్ తీసుకోవాలంటున్నారు. నొప్పి బిళ్లలు వేసుకున్నా పని చేయటం లేదు. ఆహారంలో మార్పులు ఏమైనా సూచిస్తారా?
-కైలాస్‌నాథ్ (ఖరగ్‌పూర్)

Pages