S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అవివాహ భోజనంబు!

పెళ్లికి రెండ్రోజుల ముందే అకారణంగా దానిని రద్దు చేసుకున్న ఆ పెళ్లికూతురు అంతకు ముందు ఆర్డర్ ఇచ్చిన 170 ప్లేట్ల విందు భోజనాన్ని ఏం చేయాలో అర్థంకాక సతమతమైంది. వివాహం జరగకపోయినా పార్టీ ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది? అని నిర్ణయించుకుని చుట్టుపక్కల ఉన్న డజన్ల కొద్దీ ఇళ్లులేని పేదలను అదే రోజు విందుకు ఆహ్వానించింది.
ఇదంతా జరిగింది - అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో కార్మెల్ పట్టణంలో. ఆ అమ్మాయి పాతికేళ్ల సారా కమిన్స్. ఫార్మసీ విద్యార్థిని అయిన ఈమె రెండేల్లు అతికష్టం మీద 30 వేల డాలర్లు పొదుపు చేసుకుంది. అది కూడా తన పెళ్లిలో ఖర్చు పెట్టుకోవడం కోసం. తీరా పెళ్లిరోజుకి రెండ్రోజుల ముందే అది రద్దు కావటంతో, వారం రోజుల కిందటే ఆ ఊళ్లోని రిట్జ్ ఛార్లెస్ హోటల్‌లో ఆర్డర్ ఇచ్చిన విందు రద్దు చేయడం కుదర్లేదు. అంతకు ముందే పెళ్లికి ఆహ్వానించిన అతిథులందరికీ ఫోన్ చేసి, పెళ్లి రద్దయిన విషయాన్ని చెప్పింది కానీ, హోటల్ ఆర్డర్ ఇచ్చిన షడ్రసోపేతమైన విందును రద్దు చేయడం మాత్రం సాధ్యం కాదని అర్థమై పోయింది. చివరికి ఇళ్లు లేని పేదలందరినీ విందు భోజనం ఆరగించడానికి ఆహ్వానించింది. ఈ సంగతి తెలిసిన చుట్టుపక్కాలు కొందరు ఈ కొత్త అతిథులకి డాబుసరిగా కనిపించేలా అందమైన డ్రస్సులు పంపించారు.
హోటల్‌లో జరిగిన ఈ విందుకు హాజరైన పేద అతిథులు కూడా ఉబ్బితబ్బిబ్బయి ఈ అవకాశం తాము తలెత్తుకుని జీవించేలా చేసిందని, ఇళ్లు లేకపోయినా సమాజంలో ఇతరులతోపాటు సమానంగా సంబరాలు చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసం కలిగించిందని గొప్పగా చెప్పుకున్నారు. నిరాశ్రయులని చాలామంది తమని పట్టించుకోవడం మానేస్తారని తాము భావిస్తున్న తరుణంలో కమిన్స్ లాంటి అమ్మాయిలు తమని గురించి ఆలోచించి గర్వకారణంగా ఉందన్నారు. జెన్ ఫెన్ అనే అతిథి మాట్లాడుతూ ‘్భజనాలు అయ్యాక వీడ్కోలు తీసుకునే ముందు మేమంతా సారా కమిన్స్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, మనసారా దీవించడంతో ఆమె కల్లల్లోంచి రాలిన ఆనంద బాష్పాలు మాకెంతో ఆనందాన్నిచ్చాయి’ అన్నాడు. అంతా పూర్తయ్యాక కమిన్స్ డొమినికల్ రిపబ్లిక్ దేశానికి హనీమూన్ కోసం బయలుదేరి వెళ్లిపోయింది. కాకపోతే, పెళ్లికొడుకు అంతకు ముందే రిజర్వ్ చేసుకున్న టికెట్‌ను కేన్సిల్ చేసుకోవడంతో ఆమె తన తల్లిని తోడుగా తీసుకుని ప్రయాణమైంది.

-జి.కృష్ణమూర్తి