S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పిచ్చి చేష్టలు (కథ)

శివయ్య, రామయ్య ప్రాణమిత్రులు. ఇరుగుపొరుగునే ఉంటున్నారు. వ్యవసాయం వారి ప్రధాన వృత్తి. పెద్దగా చదువుకోలేదు. ఇరువురూ ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకుంటూ ఎంతో సఖ్యంగా ఉంటున్నారు. వారి సఖ్యతను చూసి ఊరి జనం స్నేహితులంటే ఇలా ఉండాలని అనుకుంటూ ఉంటారు.
శివయ్యకి ఒక్కగానొక్క కొడుకు. రామయ్య ఇద్దరాడపిల్లల తండ్రి. ఈడొచ్చిన పెద్ద కూతురికి ఆ యేడు పెళ్లి చేయాలనుకున్నాడు. స్నేహితుడి సహకారంతో రెండు మూడు సంబంధాలు చూసి పట్నంలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి పిల్లనివ్వాలనుకున్నాడు. పెళ్లికొడుకుతోపాటు అబ్బాయి తరఫు వాళ్లంతా అమ్మాయిని ఇష్టపడటంతో క్షణాల మీద శాస్త్రుల వారిని పిలిచి పెళ్లి ముహూర్తం ఖాయం చేశాడు. ఊళ్లోని జనం అంతా ‘ఓహో’ అనుకునేలా కల్యాణ మండపంలో పెళ్లి ఆర్భాటంగా చేయాలనుకున్నాడు. ఆకర్షణీయమైన పెళ్లికార్డులు ముద్రించి అందరికీ పంచిపెట్టాడు.
పెళ్లి రోజు రానే వచ్చింది. మధ్యాహ్నం అందరికీ విందు ఏర్పాటు చేశాడు.
ఆహ్వానితులు ఒక్కొక్కరు వస్తున్నారు. వచ్చిన వాళ్లంతా తమకు తోచిన కానుకల్ని తెచ్చి ఇస్తున్నారు. అందరికీ స్వాగతం పలుకుతూ కూర్చోబెడుతున్నాడు శివయ్య.
‘వంటలై పోయాయి. భోజనాలకు లేవండి’ అన్నాడు రామయ్య.
విందు భోజనం ఆరగించడానికి లోపలికొస్తున్న వ్యక్తితో ‘మీ ఆధార్ కార్డు చూపిస్తారా’ అని అడిగాడు.
ఆ మాటకు అతడు నోరెళ్లబెడుతూ పర్సులోంచి కార్డు తీసి చూపించాడు.
ఇది గమనించిన శివయ్య గభాలున స్నేహితుణ్ణి పక్కకు లాగి ‘ఏంట్రా నువ్వు చేస్తున్నది? నీకు మతిగాని పోయిందా?’ అని అడగాడు ముఖం చిట్లిస్తూ.
‘నీకు తెలియందేముంది. అంతా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం ఇవాళ ప్రతి పనికి ఆధార్ కార్డుతో ముడి పెడుతోంది. మనం కూడా ఆధార్ కార్డు చూపించమంటే తప్పేంటి? వచ్చిన వాళ్లు మనం పిలిచిన వ్యక్తులా కాదా అన్న విషయం తెలిసిపోతుంది కదా? అందుకని...’
‘నీ తెలివి తెల్లారినట్టే ఉంది. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రమా?! నేను చూడబట్టి సరిపోయింది. లేకుంటే తమని అవమానపరుస్తున్నారనుకుని వచ్చిన వాళ్లంతా వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోగలరు. చివరికి నువ్వూ నేనే మిగుల్తాం. ఇటువంటి విందులకు ఆహ్వానించిన వాళ్లే వస్తారు తప్ప నువ్వు పెట్టే ముద్దకి వాచి ఎవరూ రారు’ అంటూ మిత్రుడికి గడ్డి పెట్టాడు శివయ్య.
‘ఔను కదా! నేనంత దూరం ఆలోచించలేదు’ అంటూ నాలుక్కరుచుకున్నాడు రామయ్య.
‘సరే. ఇక ఇలాంటి పిచ్చిచేష్టలు మానేసి అందర్నీ సాదరంగా లోపలకు పిలూ’ అని చెప్పి మరో పనిలో నిమగ్నమయ్యాడు శివయ్య.

-దూరి వెంకటరావు