AADIVAVRAM - Others

రెటీనా పునరుత్పత్తి సాధ్యమేనా? (విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ శరీరంలో అన్ని అవయవాలలో కణజాలం దెబ్బతిన్నా తిరిగి ఏర్పడటం మామూలే. దెబ్బలు తగిలినా, కాలిన గాయాలైనా నాశనమైన కణజాలం ఎండిపోయి కొత్తగా మళ్లీ ఏర్పడి పాతరూపునకు ఆయా భాగాలు వస్తాయి. అయితే కంటిలోని రెటీనా మాత్రం అలా పునరుత్పత్తికాదు. అందుకే కళ్లకు గాయాలై రెటీనా దెబ్బతింటే ఇక చూపు సాధ్యపడదు. ఈ భూమిపై ఉన్న జీవరాశిలో ఒక్క జీబ్రాఫిష్‌లో మాత్రమే రెటీనా దెబ్బతిన్నప్పటికీ నెమ్మదిగా మళ్లీ ఆ భాగం పునరుత్పత్తి అవుతుంది. దెబ్బతిన్న చూపు మళ్లీ వస్తుంది. దాని ఆధారంగా కొందరు శాస్తవ్రేత్తలు చేపట్టిన పరిశోధనలు సరికొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. అంధత్వంతో బాధపడే వారికి మళ్లీ దృష్టి వచ్చేలా చేయడం సాధ్యపడే అవకాశాలపై ఈ ఫలితాలు ఆశలు రేపుతున్నాయి. ఆ చేపల్లో రెటీనా పునరుత్పత్తి ఎలా సాధ్యమవుతోంది, కారణాలు ఏంటి ఏఏ ప్రక్రియలవల్ల అది జరుగుతోందన్నది ఏళ్లతరబడి చేసిన పరిశోధనల్లో తేలింది. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన శాస్తవ్రేత్తలు జీబ్రాఫిష్‌లపై పరిశోధనలు చేశారు. వాటి కళ్లలోని రెటీనా దెబ్బతిన్నప్పుడు వాటిలోని న్యూట్రాల్ కణజాలం పునరుత్పత్తి అవుతోంది. వాటి రెటీనాల్లో ఉండే ముల్లర్ గ్లియా అనే రసాయనం వల్ల న్యూట్రాన్‌లు యాక్టివ్ అవుతున్నాయి. ఆ చేపల్లో ఉండే ఒక రకమైన జీన్ ‘ఎఎస్‌సిఎల్1’ను ఇది యాక్టివేట్ చేస్తుంది. నిజానికి ఇది ఒక ప్రొటీన్. దీనిని ఉత్తేజం కలిగేలా చేయడం ద్వారా టమోక్సిఫినె అనే రసాయనం విడుదలై ముల్లర్ గ్లియాతో కలసి దెబ్బతిన్న రెటీనా కణజాలం స్థానంలో కొత్త కణజాలం ఏర్పడుతుందని కనిపెట్టారు. అందుకే జీబ్రాచేపల్లో రెటీనా దెబ్బతిన్నప్పటికీ ఆ తరువాత కొద్దికాలంలోనే అవి మళ్లీ పూర్తి చూపును పొందగలుగుతున్నాయి. వాటిలాగానే మానవుల్లో ఎందుకు సాధ్యంకాదు అన్నది ఇప్పుడు శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని రకాల ఎలుకలపై ఇటీవల కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. ఒక ఎలుక కళ్లలో రెటీనా దెబ్బతినగా దానిపై ముల్లర్ గ్లియాను ఇంజెక్ట్ చేశారు. ఆ తరువాత జీన్ ఎస్‌సిఎల్1ను చొప్పించారు. ఇది ఆశాజనకమైన ఫలితాన్ని ఇచ్చింది. అయితే మూడువారాల వయస్సున్న ఎలుకల్లో ఈ ప్రయోగాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. బాగా ఎదిగిన ఎలుకల్లో ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని గుర్తించారు. నిజానికి జీబ్రాఫిష్‌లలో జరిగే ప్రక్రియ వీటిలో సాగుతుందా లేదా అన్న పరిశోధనలో ఆశాజనకమైన ఫలితాలు రావడంతో శాస్తవ్రేత్తలో సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఈ పరిశోధనలు కొనసాగితే భవిష్యత్‌లో మానవులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
*