S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇదేం విడ్డూరం?!

పెళ్లి కుదిరినా, పెళ్లికొడుకు తన మనసుకు నచ్చే రీతిలో డాన్స్ చేయలేదని అతడు ఊరేగుతూ వచ్చిన గుర్రం స్టెప్పులు మెచ్చుకుని, దానిని మనువాడిందా పెళ్లికూతురు! ఇది జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. చుట్టాలందరికీ పెళ్లికొడుకు నృత్యాభినయం వికారంగా అనిపించడంతో వాళ్లంతా మూతి విరిచారు. వీళ్లకే కాదండోయ్.. అసలా వధువుకి కూడా అతగాడి వరస రోత పుట్టించింది. వెంటనే ‘నాకీ పెళ్లిగిళ్లీ వద్దు. ఆ గుర్రం బాగా డాన్స్ చేస్తోంది.. దానినే పెళ్లి చేసుకుంటాను’ అని పెళ్లి పీటల పైకి ఎక్కనని ఆ పెళ్లికూతురు మొండికేసింది!
అసలు సంగతి ఏమిటంటే - పెళ్లి సంబరాలు మొదలవుతుండగా, వరుడు డాన్స్ చేద్దామని ఉబలాటపడి, భజంత్రీల వాళ్లని మంచి ట్యూన్ కొట్టమన్నాడు. కానీ, అందుకు తగ్గట్టుగా స్టెప్పులు వేయలేకపోయాడు. ఈలోగా అక్కడే ఉన్న ఊరేగింపు గుర్రానికి ఊపు వచ్చేసి, అది డాన్స్ చేయడం ప్రారంభించింది. ఈ వ్యవహారాన్ని గమనించిన పెళ్లికూతురు కాబోయే పెళ్లికొడుకు కంటే, గుర్రమే బాగా డాన్స్ చేస్తోందని, దానినే పెళ్లి చేసుకుంటానని భీష్మించుక్కూర్చుంది. అక్కడే ఉన్న అతిథులంతా మొదట షాకై తర్వాత తేరుకుని పెళ్లి భోజనాలు ఆరగించి, తాపీగా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఈ వింత సంఘటనతో ఆ గుర్రం సెలెబ్రిటీగా మారిపోయి న్యూయార్క్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్‌లో తన సత్తా చాటనుంది. అది కూడా ‘టైగర్ ష్రాఫ్’ లాంటి యాక్టర్ల సరసన. పై సంగతి అలా ఉంటే.. అదే ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో మరో పెళ్లికూతురు తనకు కాబోయే పెనిమిటి స్వేతంక్ సింగ్ గుట్కా నమలడం నచ్చక వికారంతో ‘నువ్వు నాకు వద్దు’ అని పొమ్మంది. పురోహితుడితో పెళ్లి ఆపేయమని చెప్పి ఠక్కున పెళ్లిపీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. మన దేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో గుట్కా నమిలే అలవాటు అధికం. కానీ, ఈ పెళ్లి వ్యవహారం బయటకు పొక్కిన తర్వాత అక్కడి సర్కారు కూడా గుట్కాను నిషేధించాలని ప్రతిపాదనలు చేస్తోంది.
ఇదే రాష్ట్రంలో కాజీతర్‌హర్ అనే గ్రామంలో పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా, బాణాసంచా పేలుళ్లకు బెదిరిపోయిన ఓ గుర్రం తన మీద కూర్చున్న పెళ్లికొడుకుతో సహా పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. అదృష్టవశాత్తు వెంటనే అక్కడున్న వారంతా గుర్రాన్ని, పెళ్లికొడుకును కాపాడి బయటికి తీశారు. ఏమిటో?! ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సమస్యలు ఇటీవలి కాలంలో పుట్టుకొస్తూనే ఉన్నాయి.

-జి.కృష్ణమూర్తి