S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోబోడాగ్ వస్తోంది! (విజ్ఞానం)

కుక్కలను పెంచుకోవడం చాలామందికి ఇష్టం. రక్షణకోసం, ఆనందం కోసం, కాలక్షేపం కోసం వాటిని పెంచుకుంటారు. వాటి పెంపకం ఖర్చుతో కూడినదే. పైగా వాటి ఆలనాపాలనా శ్రమతో చేయాల్సినదే. అత్యుత్తమ జాతికి చెందిన శునకాలను కొనడమూ అందరికీ వీలుకాదు. నిజానికి విశ్వాసానికి, స్నేహానికి మారుపేరుగా నిలిచే శునకాలవల్ల ఒక్కోసారి ఇబ్బందులూ ఎదురవుతుంటాయి. పిల్లలకు, వృద్ధులకు నచ్చేలా, అసలైన శునకాన్ని మించేలా స్నేహపూర్వకంగా, భావాలు వ్యక్తం చేయగలిగేలా, యజమానిని గుర్తుపట్టగలిగే ‘రోబోడాగ్’ను సృష్టించారు. తక్కువ ధరకు, ప్రమాదమేమీ లేకుండా ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఆసరాగా చేసుకున్న ఈ ‘మిరో రోబో డాగ్’ పరిశోధనలన్నీ పూర్తి చేసుకుని తొలిసారిగా ‘డెమో’ కూడా ఇచ్చింది. తన యజమాని ముఖాన్ని గుర్తించి దగ్గరకు రావడం, సెన్సార్స్ ఆధారంగా చుట్టుపక్కల పరిణామాలను గుర్తించడం, అరవడం, ముద్దులుపోవడం, ఒకవేళ యజమాని పడుకుంటే అచ్చమైన శునకాల్లా మోమును నాలుకతో ముద్దాడటం వంటి పనులన్నీ ఈ రోబో డాగ్ చేస్తుంది. వయసుమీదపడ్డాక కూడా యజమానిని గుర్తుపట్టే విధంగా దీనిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి 20 ఆల్ఫా ప్రొటైటైప్స్, 50 బీటా ప్రొటోటైప్స్‌ను వాడి దీనిని రూపొందించారు. ఆకర్షణీయ రూపం కోసం కుక్క, కుందేళ్లను తలపించేలా డిజైన్ చేశారు. వీల్స్‌పై తిరిగే ఈ రోబోడాగ్‌ను సెబాస్టియన్ కాన్‌రాన్ అనే టెకీ రూపొందించారు. కాన్వొకేషనల్ రోబోటిక్స్ కోఫౌండర్, డెవలపర్ అయిన సెబాస్టియన్ యూనివర్శిటీ ఆఫ్ షఫీల్డ్ రోబోటిక్ విభాగం సిబ్బందితో కలసి దీనిని సృష్టించారు. ఇంగ్లండ్‌లో కొద్దిరోజుల క్రితం నిర్వహించిన రోబోటిక్ ఎక్స్‌పోలో దీనిని డెమో ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ పరంగా మరికొంత అభివృద్ధి చేసి వచ్చే ఏడాదికి మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ఆప్టికల్ నేవిగేషన్, స్మార్ట్‌సెన్సారింగ్ వ్యవస్థ, డిటెక్టింగ్ టెక్నాలజీ, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఇది తయారైంది. యజమాని గొంతును, రూపాన్ని ఇది గుర్తుపడుతుంది. కాళ్లకు బదులు చక్రాలతో ఇది నడుస్తుంది. ఛార్జింగ్, పవర్‌ను తక్కువగా వినియోగించుకునేందుకు వీలుగా దీనిని ఇలా రూపొందించారు. భవిష్యత్తులో రక్షణ, తోడునీడగా, పెద్దవారి ఆలనాపాలనా చూడగలిగేలా దీనిని అభివృద్ధి చేయనున్నారు. అచ్చం మనిషిలా భావోద్వేగాలను వ్యక్తం చేయడం పూర్తిగా సాధ్యంకాకపోయినా కొన్నింటిని వ్యక్తపరిచేలా దానిని రూపొందించనున్నారు.