S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శాకాహారమే శరణ్యం (మీకు మీరే ఢాక్టర్)

ప్రశ్న: ఆహారంతో ఆరోగ్యం గురించి మీరు చెప్తున్న విషయాలు చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. నాదొక సందేహం. శాకాహారమూ వేడి చేస్తోంది కదా.. మాంసాహారం శాకాహారాలలో ఏది మంచిది?
-ప్రసాద్ జె.ఎస్. మచిలీపట్నం
జ: ఆహారాన్ని తీసుకోవటం (consumption), జీర్ణం కావటం (digestion), జీవన క్రియల నిర్వహణ (metabolism), ఆహార నిలవ(storage of food) ఇవన్నీ జీవన క్రియల వేగాన్ని పెంపుచేసే అంశాలు. వీటి వలన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణశక్తి ప్రభావాన్ని(thermic effect of food -TEF) అంటారు. శరీరంలో ఉష్ణశక్తి పెరిగినప్పుడు సామాన్యుడి భాషలో వేడి చేయడం అంటారు.
ఆయుర్వేదం దీనే్న పిత్తంగా పేర్కొంది.
శరీరంలోని సమస్త జీవన క్రియల్నీ నడిపిస్తోన్నది ఈ పిత్త ధాతువే! ఇది సమస్థితిలో ఉన్నప్పుడు ఆహారం ఒక్క ఉష్ణ ప్రభావం (ఉ) కూడా సమస్థితిలో ఉంటుంది. ఇది వికారం చెందినప్పుడు పిత్తం దోషంగా మారి, శరీరాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. దీనే్న వేడి చేయటం అంటారు. దీనివలన కోపం, చిరాకు, ఆవేశం, అసహనం, ఉద్రేకపడటం, వివాదపడటం లాంటి లక్షణాలతోపాటు, కడుపులో ఎసిడిటీ లక్షణాలు, నిద్ర చెడటం, పిచ్చికలలు, నోటి దుర్వాసన, శరీరంలోంచి పుల్లని వాసన, ఉడుకు విరేచనాలు, వేడిని భరించలేక పోవటం, శరీరం మీద దద్దుర్లు, పేలుడు, మొటిమలు, రక్తంలో సుగరు స్థాయి తగ్గటం, జ్వరం వచ్చినట్టుండటం, విపరీతంగా చెమటలు, కాళ్లూ చేతులు పీకటం, నొప్పులు, మంటలు పుట్టటం ఇలాంటి లక్షణాలు కలుగుతాయి. అతిగా వేడి చేసినందువలన జీర్ణశక్తి చెడుతుంది. మనిషి మానసికంగా కూడా కొంత ఆందోళనకు లోనౌతాడు. దృఢమైన స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేని స్థితి ఏర్పడుతుంది.
గోంగూర లాంటి పుల్లని పదార్థాలు, మసాలాలు, కఠినంగా అరిగే బిరియానీ, పలావులు, ఊరుగాయలు ఇలాంటివన్నీ high thermic effect ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇవి జీర్ణం కావటానికి ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. వీటిని తీసుకున్నప్పుడు బాగా వేడి చేస్తాయని దీని భావం.
పిండిపదార్థాలు, ముఖ్యంగా పంచదార ఎక్కువగా కలిగిన ద్రవ్యాలు జీర్ణం కావటానికి తక్కువ ఉష్ణోగ్రతని తీసుకుంటాయి. అందువలన అవి తక్కువ వేడి చేస్తాయి. కూరగాయలన్నీ తక్కువ ఉష్ణోగ్రతతోనే అరిగిపోతాయి. పులుపులేని ఏ కూరగాయైనా చలవచేసేవే గానీ వేడి చేయవు. కోమలమైన ఈ కూరగాయల్ని చింతపండు రసం, మసాలాలు, కారాలు ఎక్కువగా కలిపి వండటం వలన అవి వేడి చేస్తున్నాయి. కూరగాయని వీటితో కలపకుండానూ, నూనెలో వేసి వేయించకుండాను కమ్మగా ఇగురు కూరల్లా వండుకుంటే కూరలన్నీ తేలికగా అరుగుతాయి. చలవ చేస్తాయి. జీర్ణశక్తి మెరుగౌతుంది.
మాంసకృత్తులలు అధికంగా కలిగిన పదార్థాలు ఎక్కువ ఉష్ణోగ్రతని తీసుకుంటాయి. అందుకని అవి వేడిచేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. శనగపిండి వేడి చేయటానికి గానీ, పెసరపప్పు చలవ చేయటానికి గానీ, వాటిని తిన్నప్పుడు అవి సంగ్రహించే ఉష్ణోగ్రతే అందుకు కారణం అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తేలికగా అరిగే పదార్థాలన్నీ చలవ చేస్తాయి. కష్టంగా అరిగే పదార్థాలన్నీ వేడి చేస్తాయి. ప్రొటీన్లు అధికంగా కలిగిన పదార్థాల్లో అన్నీ వేడి చేయవు. వాటిలో బాదంపప్పు, పిస్తాపప్పు, కందిపప్పు, పెసరపప్పు లాంటివి చలవ నిచ్చేవిగానే ఉంటాయి.
మనుషులు ఆహారంలో ప్రొటీన్లను ఇష్టంగా ఎందుకు తీసుకుంటారంటే, వాటికి ప్రత్యేకమైన రంగు, రుచి, సువాసన లుంటాయి. అవి ఆహారంలో చేరినప్పుడు రుచిని పెంపుచేస్తాయి. అన్నం తిన్న సంతృప్తి కలుగుతుంది. ప్రొటీన్లను ఒ్ఘఆజళఆక చ్ఘిషఆ్యఒ అని పిలుస్తారందుకే! అంటే, త్వరగా కడుపు నిండిన సంతృప్తిని కలిగిస్తాయి. కాబట్టి ప్రొటీన్లను చేరినప్పుడు సుగరును, క్యాలరీలను పెంచే పిండి పదార్థాలను తగ్గించి తీసుకోవటం సాధ్యం అవుతుంది. ఆ మేరకు ప్రొటీన్లు సుగరు పెరక్కుండా పరోక్షంగా సహకరిస్తాయి. అన్నంలో పెసరపప్పుతో ముద్దపప్పు గానీ, పెసరపప్పు కలిసిన కూరలు గానీ, పప్పు కూరలు గానీ తరచూ వండుకుంటే ఆహారం యొక్క ఉష్ణ ప్రభావం (టిఇఎఫ్) సమస్థితిలో ఉంటుంది. దానివలన జీవన క్రియలు సక్రమంగా నిర్వహించటం సాధ్యం అవుతుంది.
ప్రొటీన్లలో చలవచేసే వాటిని రోజూ భోజనంలో తప్పకుండా తీసుకోవాలని అమెరికన్ వైద్య సంస్థలు కూడా సూచిస్తున్నాయి. వీటిని తీసుకున్నప్పుడు త్వరగా భోజన సంతృప్తి కలగటం మాత్రమే కాదు, అవి జీర్ణం అయ్యే ప్రక్రియలో శరీరంలోంచి ఎక్కువ కేలరీలను తీసుకుంటాయి. ఆ మేరకు శరీరంలో కేలరీల నిల్వ కూడా కొంత తగ్గుతుంది. సుగరు వ్యాధిలో ఈ విధంగా పెసరపప్పు, కందిపప్పు మేలు చేసేవిగా ఉంటాయి. పప్పు కన్నా మాంసం ఎక్కువ ప్రొటీన్లను కలిగి ఉండే మాట నిజం. కానీ అది ఎక్కువ థెర్మిక్ ఎఫెక్టును కలిగించి బాగా వేడిని కలిగిస్తుంది.
పప్పన్నం ఆకలిని అదుపుచేసే సిసికె, జిఎల్‌పి-1 అనే రెండు హార్మోన్లను విడుదల చేస్తుందట. అందువలన సుగరు వ్యాధి, స్థూలకాయం ఉన్న వారికి పప్పన్నం కచ్చితంగా మేలు చేస్తుంది. కొద్ది అన్నంతోనే కడుపు నింపుకొనే అవకాశం ఏర్పడుతుంది.
మాంసాహారం కన్నా పప్పుతో కూడిన శాకాహార భోజనం ద్వారా ఎక్కువ ఆహార పీచు పదార్థాలు (డైటరీ ఫైబర్) కూడా శరీరానికి అందుతాయి. మాంసం ద్వారా 6 గ్రాముల ఫైబర్ అందితే, శాకాహారం ద్వారా 25 గ్రాముల వరకూ అందుతుంది. అదీ శాకాహార ప్రయోజనం. శాకాహారం వలన జీవనక్రియలు వేగవంతం అవుతాయి. శరీర ఉష్ణోగ్రత సమస్థితిలో ఉంటుంది. మనిషి స్థిరచిత్తంతో సాధకుడిగా ఎదుగుతాడు.
వేడిచేసే స్వభావం ఉన్న పులుపు, మసాలాలు, కారాలు, నూనెల వాడకం మితిమీరితే శరీర జీవన క్రియలు దెబ్బతింటాయి. శరీర ఉష్ణోగ్రత అసాధారణంగా పెరిగి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. శాకాహారమే మనిషికి శరణ్యం.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com