S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

,
06/12/2016 - 05:07

న్యూఢిల్లీ, జూన్ 11: పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు బిజెపి అధికారంలో ఉన్న రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వెంకయ్యతోపాటు రాజ్యసభకు పోటీ చేసిన కేంద్ర మంత్రులంతా వివిధ రాష్ట్రాల నుంచి విజయం సాధించారు. కొందరు మంత్రులు ఏకగ్రీవంగా ఎన్నికైతే, మరికొందరు పోటీని ఎదుర్కోక తప్పలేదు.

06/12/2016 - 04:11

అలహాబాద్, జూన్ 11: అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బిజెపి జాతీయ కార్యవర్గం ఆదివారం నుంచి రెండు రోజులపాటు ఇక్కడ సమావేశం కానుంది, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

06/12/2016 - 04:05

లక్నో, జూన్ 11: ఉత్తరప్రదేశ్‌లో రోడ్లు, వాటి పక్కన గల కాలిబాటలను ఆక్రమించి నిర్మించిన అన్ని రకాల మత కట్టడాలను తొలగించడం గానీ లేదా ఇతర ప్రాంతాలకు తరలించడం గానీ చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రహదారులు, వీధులు, కాలిబాటలుసహా ప్రభుత్వ రోడ్లపై ఎటువంటి మత కట్టడాల నిర్మాణాన్ని అనుమతించవద్దని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

06/12/2016 - 04:04

న్యూఢిల్లీ, జూన్ 11: అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ శనివారం ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రమాదకర స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి సహకరించాల్సిందిగా అభ్యర్థించారు. సుమారు 20 నిమిషాల సేపు సాగిన ఈ భేటీలో సోనోవాల్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానికి వివరించారు.

06/12/2016 - 04:02

చండీగఢ్, జూన్ 11: స్కూల్ టీచర్లు ఎవరూ జీన్స్ ధరించకూడదని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో ఉండగా సాధారణ దుస్తులే వేసుకోవాలని హర్యానా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డైరక్టరేట్ స్పష్టం చేసింది. ‘ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జీన్స్ ధరించి విధులకు హాజరవుతున్నారు. విద్యాశాఖాధికారులు పాఠశాలలు తనిఖీలప్పుడూ జీన్స్‌తోనే ఉండడం అనుచితం.

06/12/2016 - 04:01

న్యూఢిల్లీ, జూన్ 11: మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ రాజేను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. మరాఠా చక్రవర్తి శివాజీ, కొల్హాపూర్ కు చెందిన రాజర్షి షాహు ఛత్రపతి మహరాజ్‌ల కుటుంబ సభ్యుడైన శంభాజీ దళిత ఆశాజ్యోతి బి. ఆర్ అంబేడ్కర్ ప్రారంభించిన సామాజిక న్యాయ ఉద్యమానికి కొంతకాలం పాటు నిధులు అందించారు.

06/12/2016 - 04:00

న్యూఢిల్లీ, జూన్ 9: హర్యానాలో శనివారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ బలపరచిన స్వతంత్ర అభ్యర్థి ఆర్కే ఆనంద్ కాకుండా బిజెపి బలపరచిన మీడియా దిగ్గజం సుభాష్‌చంద్ర గోయెంకా గెలవటం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడకుండా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 14మంది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవటం వల్లనే సుభాష్‌చంద్ర గెలిచారన్నది కాంగ్రెస్ అభిప్రాయం.

06/12/2016 - 03:55

న్యూఢిల్లీ, జూన్ 11: జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్, మరో ఇద్దరు నేతలపై దేవద్రోహం కేసు నమోదుకు దారి తీసిన గత ఫిబ్రవరి 9న యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఎడిటింగ్ చేయని వీడియో దృశ్యాలు నిజమైనవేనని సిబిఐ ఫోరెన్సిక్ ల్యాబ్ పేర్కొన్నదని పోలీసులు శనివారం చెప్పారు.

06/12/2016 - 03:54

చెన్నై, జూన్ 11: పాతిక సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులు ఏడుగురిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ పలు తమిళ సంఘాలు చెన్నైలో శనివారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి.

06/11/2016 - 19:41

లక్నో: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం జరుగనున్న నేపథ్యంలో అలహాబాద్‌లో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు బిజెపి అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

Pages