జాతీయ వార్తలు

యూపిలో గెలుపే ప్రధాన అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, జూన్ 11: అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బిజెపి జాతీయ కార్యవర్గం ఆదివారం నుంచి రెండు రోజులపాటు ఇక్కడ సమావేశం కానుంది, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మరో ఏడాదిలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అజెండాను ఈ సమావేశాల్లోనే ఖరారుచేస్తారని భావిస్తున్నారు. వాస్తవానికి గత నెల సహరాన్‌పూర్‌లో జరిగిన మోదీ ర్యాలీలోనే ఈ ఎన్నికల శంఖారావం మోగిందని రెండు రోజులుగా నగరంలోనే ఉన్న బిజెపి జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో చాలా విషయాలను చర్చించడం జరుగుతుందని, అయితే వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ ఉపాధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి అయిన ఓం మాధుర్ అన్నారు.
పార్టీ ఏర్పడిన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాలకు నగరాన్ని ఎంచుకోవడంతో పార్టీ సాధారణ కార్యకర్తల ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. నగరంలోని ప్రధాన రోడ్లు, కూడళ్లు అన్నీ కూడా ప్రధాని మోదీ, ఇతర నాయకులకు స్వాగతం పలికే కటౌట్ల, పోస్టర్లు, పార్టీ జెండాలే కనిపిస్తున్నాయి. సుల్తాన్‌పూర్ ఎంపీ వరుణ్ గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కోరే పోస్టర్లు కూడా పెద్దఎత్తున ప్రత్యక్షం కావడం విశేషం. అయితే అలాంటి నిర్ణయాలు సాధారణంగా పార్టీ పార్లమెంటు బోర్డు సమావేశాల్లోనే తీసుకుంటారని పార్టీ ప్రతినిధి శ్రీకాంత్ శర్మ చెప్పారు.
సోమవారం సాయంత్రం కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత జరగబోయే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనుండడంతో పెద్ద ఎత్తున జనం ఈ సభకు హాజరయ్యేలా చూడడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరోవైపు ప్రధాని వచ్చే రోజున (ఆదివారం) నిరసన ప్రదర్శనలు జరపడానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ప్రతిపక్షాలు సైతం సిద్ధమవుతున్నాయి. దీంతో నగరంలో పెద్దఎత్తున భద్రతా దళాలను మోహరించారు. సమావేశాలు జరిగే కాయస్థ పాఠశాల క్రీడా మైదానం, అలాగే ర్యాలీ జరిగే పరేడ్ గ్రౌండ్ దాదాపుగా భద్రతా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం 20 జిల్లాలనుంచి అదనపు పోలీసు బలగాలను ఈ సమావేశాల భద్రత కోసం రప్పించింది.
శర్మ, విజయ్ బహుగుణలకు స్థానం
అసోంలో బిజెపి ఘన విజయానికి కారకుల్లో ఒకరైన హిమంత బిశ్వాస్ శర్మ, పార్టీలోకి కొత్తగా చేరిన ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణలకు కొత్తగా బిజెపి జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించారు. కాగా, బిజెపి జాతీయ కార్యవర్గంలో ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగో, మాజీ కేంద్ర మంత్రి కెపి సింగ్‌దేవ్‌లాంటి వారికే కాకుండా గతంలో కర్నాటక, కేరళ, పంజాబ్, మహిపూర్ రాష్టల్ల్రో పార్టీ అధ్యక్షులుగా పని చేసిన ప్రహ్లాద్ జోషీ, వి మురళీ ధరన్, కమల్ శర్మ, చావోబా సింగ్‌లకు స్థానం కల్పించారు.

చిత్రం సమావేశాలు జరిగే కాయస్థ పాఠశాల క్రీడా మైదానం వద్ద బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పోలీసులు, నగరంలో వెలసిన పోస్టర్లు