S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/09/2016 - 07:55

న్యూఢిల్లీ, మే 8: మేధో కవాటాలు ఎప్పటికీ తెరిచి ఉన్నప్పుడే స్వేచ్ఛగా సృజనాత్మక ఆలోచనల ప్రసారాలు ఒకరి నుంచి ఒకరికి కొనసాగుతాయని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం అన్నారు. ఆలోచనల పరస్పర ప్రసారం వల్ల నూతన ఆవిష్కరణలకు దారి ఏర్పడుతుందని ఆయన అన్నారు.

06/09/2016 - 06:59

తిరువనంతపురం, జూన్ 8: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేరళకు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కోర్టులో కేసు దాఖలు చేసింది. నెయ్యర్‌లో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ కాంప్లెక్స్ సంస్థకు సంబంధించి భవన నిర్మాణాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టింది. భవన నిర్మాణ బాధ్యతలను హీథర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. పను లు పూర్తిచేసినా నిర్మాణ సంస్థకు బిల్లులు చెల్లించలేదు.

06/09/2016 - 06:27

తిరువనంతపురం, జూన్ 8: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. రుతుపవనాల ప్రభావం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కేరళలోని ఇదుక్కి జిల్లాలో భారీ వర్షాలకు ఒక వ్యక్తి మృతి చెందాడు. గత రాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురిశాయని తిరువనంతపురం ప్రాంతీయ వాతావరణ శాఖ డైరెక్టర్ కె సంతోష్ వెల్లడించారు.‘నైరుతి రుతుపవనాలు కేరళ, లక్షద్వీప్ తీరాన్ని తాకాయి.

06/09/2016 - 06:25

న్యూఢిల్లీ,జూన్ 8: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కోట మండలంలో మెగా లెదర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ఆమోదం తెలిపింది. వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఒక లేఖ రాశారు. మెగా లెదర్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తన వంతు సహాయంగా 125 కోట్ల రూపాయలు ఇస్తుంది.

06/08/2016 - 17:24

దిల్లీ: బాలింతలు, శిశువులకు ఆహారాన్ని అందించేందుకు ‘జనని సేవ’ కార్యక్రమాన్ని రైల్వేమంత్రి సురేష్ ప్రభు బుధవారం ప్రారంభించారు. వేడినీళ్లు, పాలుతో పాటు బాలింతలు, శిశువులకు అవసరమయ్యే వివిధ ఆహార పదార్థాలను 25 రైల్వేస్టేషన్లలో అందుబాటులో ఉంచుతున్నామని ఆయన తెలిపారు. 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక మెనూ రూపొందించామన్నారు.

06/08/2016 - 17:09

దిల్లీ: నెల్లూరు జిల్లా కోట మండలంలో మెగా లెదర్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం సంతకం చేశారు. రూ.128 కోట్ల వ్యయంతో కనీసం 20వేల మందికి ఉపాధి కల్పించేలా ఈ క్లస్టర్‌ ఏర్పాటు చేయనున్నారు.

06/08/2016 - 15:58

లక్నో: యుపిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య బుధవారం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వామపక్ష విద్యార్థి సంఘాలు వర్సిటీలో ఏర్పాటుచేసిన సభకు జెఎన్‌యు (దిల్లీ) నుంచి విద్యార్థి సంఘ నేత షీలా రషీద్‌ను ఆహ్వానించడంపై ఎబివిపి కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ ఏర్పడి ఉద్రిక్తతకు దారితీసింది.

06/08/2016 - 13:07

తిరువనంతపురం: వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగానే నైరుతి రుతుపవనాలు బుధవారం కేరళ తీరాన్ని తాకాయి. దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, నాలుగైదు రోజుల్లో ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

06/08/2016 - 12:20

తిరువనంతపురం: తమకు చెల్లించాల్సిన డబ్బును ఎగవేసినందుకు హెదర్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కంపెనీ మేనేజింగ్ పార్టనర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసినట్టు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు కేరళలో కొత్తకష్టాలు ప్రారంభమయ్యాయి.

06/08/2016 - 11:25

హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది.

Pages