S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/07/2016 - 17:58

పాట్నా: 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో ఉంటానని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి అసత్యవార్తలను నమ్మవద్దని బిహార్ సిఎం నితీష్‌కుమార్ అన్నారు. నిజానికి ప్రధాని అవ్వాలన్న కోర్కె తనకు ఏనాడూ లేదని ఆయన మంగళవారం ఇక్కడ ఓ పుస్తకావిష్కరణలో తెలిపారు. ఎంపీగా ఎన్నికైతే చాలని ఒకప్పుడు ఆశ పడ్డాడని గుర్తు చేశారు.

06/07/2016 - 17:56

దిల్లీ: అసమ్మతి ఎమ్మెల్యేలను ప్రభావితం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ సిఎం హరీష్ రావత్ మంగళవారం ఇక్కడ సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గిన ఆయన సిఎంగా తిరిగి బాధ్యతలు చేపట్టాక సిబిఐ అధికారుల ముందు హాజరై వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయన ఇచ్చిన జవాబులకు సిబిఐ అధికారులు సంతృప్తి చెందలేదని సమాచారం.

06/07/2016 - 17:54

దిల్లీ: యుపిలోని మథుర వద్ద ఇటీవల జరిగిన హింసాకాండపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీం కోర్టు మంగళవారం త్రోసిపుచ్చింది. అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలోని వెకేషన్ బెంచి న్యాయమూర్తులు విచారణ జరిపారు. ఈ విషయం ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు పరిధిలో ఉన్నందున సిబిఐ విచారణకు తాము ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది.

06/07/2016 - 16:40

అగర్తలా: త్రిపురలో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుదీప్‌ రాయ్‌ బర్మన్‌, ఆశిష్‌ కుమార్‌ సాహా, బిశ్వ బంధుసేన్‌, దిబా చంద్రన్‌ హర్వాంకర్‌లు తమ సంతకాలతో కూడిన రాజీనామా పత్రాన్ని మంగళవారం స్పీకర్‌కు సమర్పించగా, దిలీప్‌ సర్కార్‌, పరంజిత్‌ సింఘ ఎక్కడా కన్పించలేదు.

06/07/2016 - 12:06

ముంబయి: ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని ఆ సంస్థ గవర్నర్ రఘురాం రాజన్ మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష వివరాలను ఆయన వెల్లడించారు. రెపోరేటు 6.5శాతం, రివర్స్‌ రెపో రేటు 6.5శాతం యథాతథంగా ఉంచారు. సీఆర్‌ఆర్‌ 4శాతంలో కూడా ఎలాంటి మార్పులేదు.

06/07/2016 - 06:54

న్యూఢిల్లీ, జూన్ 6: కార్యనిర్వాహక వర్గం తన రాజ్యాంగ బాధ్యతల నిర్వహణలో విఫలమైతేనే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ స్పష్టం చేశారు. విమర్శలను గుప్పించే బదులు ప్రభుత్వం తన విధులను నిర్వర్తించాలని, కార్యనిర్వాహక వర్గం తన ధర్మాన్ని నిర్వర్తించడంలో విఫలమయినప్పుడే ప్రజలు న్యాయస్థానాలు ఆశ్రయిస్తారని ఆయన అన్నారు.

06/07/2016 - 06:53

ముంబయి, జూన్ 6: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసు కొత్త మలుపుతిరిగింది. ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మాజీ కారు డ్రైవర్ శ్యామవర్ రాయ్ తాను అప్రూవర్‌గా మారతానని ప్రత్యేక కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో రాయ్ అప్రూవర్‌గా మారితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సిబిఐ స్పష్టం చేసింది. ‘ఇంద్రాణి మాజీ డ్రైవర్ శ్యామవర్ రాయ్ అప్రూవర్‌గా మారితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయి.

06/07/2016 - 05:25

లక్నో, జూన్ 6: ఘర్షణలతో అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఆ జిల్లా కలెక్టర్‌తోపాటు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి)పై బదిలీ వేటు పడింది. మధురలోని జవహర్‌బాగ్‌లో నాలుగు రోజుల క్రితం హింసాత్మక ఘర్షణలు చెలరేగి ఇద్దరు పోలీసులు సహా 29 మంది మృతిచెందగా, అనేకమంది గాయపడిన విషయం తెలిసిందే.

06/07/2016 - 05:13

న్యూఢిల్లీ, జూన్ 6: ఢిల్లీలోని యమునా నడి ఒడ్డున నిర్వహించిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో అక్కడ జీవవైవిధ్యానికి నష్టం కలిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పరిహారంగా మిగిలిన నాలుగు కోట్ల 75లక్షల రూపాయలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ చెల్లించింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఆదేశం మేరకు ఈ మొత్తాన్ని ఢిల్లీ అభివృద్ధి అథారిటీ (డిడిఏ) వద్ద డిపాజిట్ చేసింది.

06/07/2016 - 05:10

కోల్‌కతా, జూన్ 6: ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఏ) దుర్వినియోగం అయిన దాఖలాలు లేవని సైన్యం ప్రకటించింది. ఎఎఫ్‌ఎస్‌పిఏ దుర్వినియోగానికి సంబంధించి ఇటీవల ఎక్కడా ఫిర్యాదులు లేవని స్పష్టం చేశారు. ఈస్ట్రన్ కమాండెంట్ దీనిపై మాట్లాడారు.

Pages