S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/08/2016 - 08:17

న్యూఢిల్లీ, జూన్ 7: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా నదీ యాజమాన్యం బోర్డుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాసి రాజకీయం చేయటం మంచిది కాదని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి ఆరోపించారు.

06/08/2016 - 07:03

న్యూఢిల్లీ, జూన్ 7: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో జరిగిన ఘర్షణలపై సిబిఐ విచారణకు ఆదేశించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. మధుర ఘర్షణలో ఇద్దరు పోలీసు అధికారుల సహా 29 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ ప్రభుత్వం దర్యాప్తుపై తమకు విశ్వాసం లేదంటూ ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

06/08/2016 - 08:13

న్యూఢిల్లీ/చండీగఢ్, జూన్ 7: పంజాబ్ యువతను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ‘ఉడ్తా పంజాబ్’ చిత్రంపై సెన్సార్ కత్తెర వేయడంపై బాలీవుడ్ నిప్పులు చెరుగుతోంది. సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లజ్ నిహలానీ ఏకపక్ష ధోరణితో నియంతగా వ్యవహరిస్తున్నారంటూ సహనిర్మాత అనురాగ్ కశ్యప్ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు.

06/08/2016 - 06:59

ఎటా, జూన్ 7: గత రెండేళ్లలో ఏం చేశారని వేడుకలు జరుపుకొంటున్నారని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ఎదురుదాడి చేస్తూ, కనీసం తాము మాట్లాడే ప్రధానిని ఇచ్చామన్నారు. ‘రెండేళ్లలో ఏం చేశారని ఇటీవల రాహుల్ గాంధీ బిజెపిని ప్రశ్నించారు.

06/08/2016 - 06:58

ఢాకా, జూన్ 7: బంగ్లాదేశ్‌లో మంగళవారం 70 ఏళ్ల హిందూ పూజారిని ఇస్లామిక్ స్టేట్ జిహాదీలుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు. ముస్లిం దేశమైన బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది హత్యకు గురయిన హిందూపూజారుల్లో ఈయన రెండో వ్యక్తి.

06/08/2016 - 06:56

న్యూఢిల్లీ, జూన్ 7: ‘రోమ్ నగరం మండిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు’ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలుతుంటే అధినాయకత్వం మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా మారినా అధిష్ఠానం మాత్రం చక్కదిద్దే చర్యలు తీసుకోవటం లేదు.

06/08/2016 - 06:55

న్యూఢిల్లీ, జూన్ 7: అమెరికాలోని వెస్ట్రన్ కెంటకీ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదువుతున్న 60 మంది భారతీయ విద్యార్థుల్లో 25 మందిని అవసరమైన అడ్మిషన్ అర్హతలు లేవన్న కారణంగా భారత్‌కు తిరిగి వెళ్లాలని లేదా మరో యూనివర్శిటీ వెతుక్కోవాలని యూనివర్శిటీ ఆదేశించింది. గత ఏడాది వేసవిలో భారత్‌లో పెద్దఎత్తున రిక్రూట్‌మెంట్ ప్రచారం నిర్వహించిన తర్వాత గత జనవరిలో యూనివర్సిటీ వీరిని చేర్చుకున్నది.

06/08/2016 - 06:52

న్యూఢిల్లీ, జూన్ 7: కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులను తగ్గించేందుకు న్యాయస్థానం వెలుపల పరిష్కరించుకోవాలన్న ప్రభుత్వం ప్రతిపాదనకు లీగల్ రిఫామ్స్ ప్యానెల్ మద్దతు తెలుపుతోంది. నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరి, న్యాయ సంస్కరణల కమిటీ ఎదుట కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. మధ్యవర్తులద్వారా పరిష్కారమయ్యే కేసులకు చట్టబద్ధత ఉండాలని యోచిస్తోంది.

06/08/2016 - 06:52

న్యూఢిల్లీ, జూన్ 7: అణు సరఫరా దేశాల కూటమిలో సభ్యత్వం కోసం పట్టుబడుతున్న భారత్ అంతే కీలకమైన విజయాన్ని సాధించింది. క్షిపణి టెక్నాలజీ నియంత్రణ కూటమి (ఎమ్‌టిసిఆర్)లో సభ్యత్వాన్ని సంపాదించుకుంది. 34 దేశాల ఈ కూటమిలో సభ్యత్వంకోసం భారత్ అభ్యర్థించిందని, ఏ సభ్య దేశం ఇందుకు అభ్యంతరం చెప్పకపోవడంతో భారత్ ఇందులో చేరినట్టే అయిందని దౌత్యవేత్తల్ని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

06/07/2016 - 18:07

ఢిల్లీ: 2017 జూన్ 2 లోపు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికి స్థానికత వర్తించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయనున్నారు. లోకల్ ఫైల్‌ను పీఎంవో మంగళవారం క్లియర్ చేసింది. పది రోజుల్లోగా రాష్ట్రపతి లోకల్ ఫైల్‌ను ఆమోదించే అవకాశం ఉంది. స్థానికతపై గత ఏడాది అక్టోబర్ 9న కేంద్రానికి ఎపి సిఎం చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.

Pages