జాతీయ వార్తలు

25 మంది భారతీయ విద్యార్థులు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: అమెరికాలోని వెస్ట్రన్ కెంటకీ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదువుతున్న 60 మంది భారతీయ విద్యార్థుల్లో 25 మందిని అవసరమైన అడ్మిషన్ అర్హతలు లేవన్న కారణంగా భారత్‌కు తిరిగి వెళ్లాలని లేదా మరో యూనివర్శిటీ వెతుక్కోవాలని యూనివర్శిటీ ఆదేశించింది. గత ఏడాది వేసవిలో భారత్‌లో పెద్దఎత్తున రిక్రూట్‌మెంట్ ప్రచారం నిర్వహించిన తర్వాత గత జనవరిలో యూనివర్సిటీ వీరిని చేర్చుకున్నది. అయితే తొలి సెమిస్టర్ పూర్తికాగానే తగిన అర్హతలు లేవన్న కారణంగా వారిని భారత్ తిరిగి వెళ్లాలని లేదా మరో యూనివర్శిటీని వెతుక్కోవాలని కోరిందని మంగళవారం మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ రిక్రూటర్ల సాయంతో యూనివర్శిటీ వీరిని ఎంపిక చేసుకుంది. యూనివర్శిటీ అవసరమైన సాయాన్ని అందించినప్పటికీ దాదాపు 40 మంది విద్యార్థులు అడ్మిషన్‌కు అవసరమైన అర్హతలు కలిగిలేరని తేలిందని, వారిలో కొందరిని యూనివర్శిటీలో కొనసాగడానికి అనుమతించినప్పటికీ కనీసం 25 మంది యూనివర్శిటీ వదిలిపెట్టక తప్పదని యూనివర్శిటీ కంప్యూటర్ ప్రోగ్రామ్ చైర్మన్ జేమ్స్ గ్యారీ చెప్పినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కథనం పేర్కొంది. యూనివర్శిటీ అడ్మిషన్ ప్రమాణాలకు అనుగుణంగా వారు లేరని, అలాంటి వారిని యూనివర్శిటీలో కొనసాగించడం వల్ల యూనివర్శిటీ పేరు ప్రతిష్ఠలకు నష్టం వస్తుందని ఆయన అన్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయాలు వెతుక్కోడానికి యూనివర్శిటీ సాయం వారికి ఉంటుందని ఆయన చెప్పారు. కాగా, ఈ విద్యార్థుల పరిస్థితి పట్ల తాను తీవ్రంగా ఆందోళన చెందుతున్నానని యూనివర్శిటీ భారతీయ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఆదిత్య శర్మ అన్నారు. చదువుకోసం వాళ్లు బోలెడంత డబ్బు ఖర్చు చేసి ఇంత దూరం వచ్చారని, అయితే కొంతమంది విద్యార్థులు తమ చదువు పట్ల ఉదాసీనంగా వ్యవహరించారని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న తరుణంలోనే ఈ ఉదంతం వెలుగులోకి రావడం గమనార్హం.