జాతీయ వార్తలు

క్షిపణి కూటమిలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: అణు సరఫరా దేశాల కూటమిలో సభ్యత్వం కోసం పట్టుబడుతున్న భారత్ అంతే కీలకమైన విజయాన్ని సాధించింది. క్షిపణి టెక్నాలజీ నియంత్రణ కూటమి (ఎమ్‌టిసిఆర్)లో సభ్యత్వాన్ని సంపాదించుకుంది. 34 దేశాల ఈ కూటమిలో సభ్యత్వంకోసం భారత్ అభ్యర్థించిందని, ఏ సభ్య దేశం ఇందుకు అభ్యంతరం చెప్పకపోవడంతో భారత్ ఇందులో చేరినట్టే అయిందని దౌత్యవేత్తల్ని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఈ గ్రూపు అనుసరించే ‘వౌన పద్ధతి’ ప్రకారం భారత్ చేరికను ఆమోదించినట్టేనని తెలిపింది. ఈ సభ్యత్వం వల్ల భారత్‌కు అనేక ప్రయోజనాలుంటాయి. క్షిపణి టెక్నాలజీని కొనుగోలు చేయడమే కాకుండా అత్యాధునిక నిఘా డ్రోన్‌లను సమకూర్చుకోగలుగుతుంది.