జాతీయ వార్తలు

కనీసం నోరున్న ప్రధానిని ఇచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటా, జూన్ 7: గత రెండేళ్లలో ఏం చేశారని వేడుకలు జరుపుకొంటున్నారని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ఎదురుదాడి చేస్తూ, కనీసం తాము మాట్లాడే ప్రధానిని ఇచ్చామన్నారు. ‘రెండేళ్లలో ఏం చేశారని ఇటీవల రాహుల్ గాంధీ బిజెపిని ప్రశ్నించారు. కనీసం మేము మాట్లాడే ప్రధానిని ఇచ్చాం, యుపిఏ పదేళ్ల పాలనలో సోనియా గాంధీ రాహుల్ బాబా తప్ప ప్రధాని గొంతును ఎవరూ వినలేదు’ అని అమిత్ షా అన్నారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందని, గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సమాజ్‌వాది పార్టీని ప్రశ్నించారు. ‘ఎన్డీయే ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఒక రిపోర్ట్ కార్డును మేము సమర్పిస్తున్నాం నాలుగేళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి’ అని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నుద్దేశించి షా అన్నారు. జిల్లాలోని కాస్‌గంజ్‌లో బూత్‌స్థాయి పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మీకు 24 గంటలూ విద్యుత్ అందుతోందా అని జనాన్ని ఆయన అడుగుతూ నిజానికి విద్యుత్ కొరత లేదని, ఉన్నదల్లా ఉద్దేశాల్లోనేనని అన్నారు. గత రెండేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం 9వేల గ్రామాలకు విద్యుత్ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఎస్పీ, బిఎస్పీ మద్దతు ఇచ్చిన యుపిఏ పదేళ్ల పాలనలో 12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు చోటుచేసుకున్నాయన్నారు. ఆకాశం, భూమి, భూమిలోపల దేన్నీ వారు వదిలిపెట్టలేదని, రెండేళ్ల ఎన్డీయే పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అన్నారు. బిపిఎల్ కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లుసహా అనేక పథకాలను మోదీ ప్రవేశపెట్టారని చెప్పారు.