S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/09/2016 - 23:53

అహ్మదాబాద్, జూన్ 9: గుజరాత్ గుల్బర్గ్ మారణకాండ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన 24మందిపై కనికరం చూపించాలని వారి తరపు న్యాయవాది గురువారం ప్రత్యేక కోర్టుకు విన్నవించారు. 2002 గుజరాత్ అల్లర్లలో నాటి ఎంపి ఎహ్సాన్ జాఫ్రితోసహా 69మందిని ఊచకోత కోసిన ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం 24మందిని దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే.

06/09/2016 - 23:51

న్యూఢిల్లీ, జూన్ 9: ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు లేకుండా దాద్రీ దురాగతం జరగదని, దాని అనంతర పరిణామాల వెనుక కూడా ఆయన మద్దతు ఉందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక మోదీ హస్తం ఉందని ఆరోపించిన ఏచూరి, బల్యాన్‌ను తక్షణం కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

06/09/2016 - 23:47

ముంబై, జూన్ 9: వివాదాస్పదంగా మారిన ‘ఉడ్తాపంజాబ్’ సినిమాలో తాము సూచించిన మార్పులు సరైనవేనని సెన్సార్ బోర్డు సమర్థించుకుంది. ఈ సినిమాలో ‘పంజాబ్’ సంకేత బోర్డును తొలగించాలని, దానితో పాటు మరో పదమూడు మార్పులను సూచించటం వెనుక ఔచిత్యంపై బాంబే హైకోర్టు గురువారం సెన్సార్‌బోర్టును ప్రశ్నించింది.

06/09/2016 - 23:47

న్యూఢిల్లీ, జూన్ 9: హైప్రొఫైల్ కేసుల విచారణ వేగవంతం చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. వివిఐపి హెలికాప్టర్ల కుంభకోణం, లిక్కర్ కింగ్ విజయమాల్యా రుణాల ఎగవేత వంటి కేసులు సత్వరం విచారణ చేపట్టడానికి గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి సారథ్యంలో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్)ను సిబిఐ నియమించింది.

06/09/2016 - 23:37

ఐక్యరాజ్య సమితి, జూన్ 9: ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడానికి ఉపయోగిస్తున్న ఔషధాలలో 80 శాతం ఔషధాలను భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థలు సరఫరా చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జెపి నడ్డా తెలిపారు. తక్కువ వ్యయం అయ్యే జనరిక్ ఔషధాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో హెచ్‌ఐవి చికిత్సను ఎక్కువగా అందుబాటులోకి తేవడానికి తోడ్పడ్డాయని ఆయన చెప్పారు.

06/09/2016 - 18:07

దిల్లీ: అక్రమాస్తులకు సంబంధించి సిబిఐ అధికారులు గురువారం ఇక్కడ జరిపిన విచారణకు హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ హాజరయ్యారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాచారం అందజేశారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై వీరభద్రసింగ్, ఆయన భార్య ప్రభావతితో పాటు మరికొందరిపైనా కేసులు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరుపుతోంది.

06/09/2016 - 17:39

ఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ సమావేశంలో గురువారం గందరగోళం నెలకొంది. ఆప్‌, బీజేపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. పలువురు కౌన్సిలర్లకు గాయాలు అయ్యాయి. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆప్‌ సభ్యులు ఆరోపించారు. బీజేపీ సభ్యులే తమను ముందు కొట్టారని ఆరోపించారు.

06/09/2016 - 13:34

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని రణ్‌పాల్ అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ శిబిరంపై సుమారు వందమంది మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. కాసేపటికి తేరుకున్న సాయుధ జవాన్లు కూడా మావోలపై కాల్పులు జరిపారు. ఇరుపక్షాల మధ్య చాలాసేపు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కొందరు జవాన్లు, మావోలు గాయపడ్డారని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

06/09/2016 - 12:54

అలహాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో గురువారం ఉదయం టైంబాంబ్‌ను పోలీసులు సీజ్ చేశారు. రైల్వేస్టేషన్ వేబ్రిడ్జ్ సమీపంలో ఈ బాంబును గుర్తించారు.

06/09/2016 - 12:38

సికింద్రాబాద్‌: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ రైల్వే సహా అనుబంధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై 11 నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఉద్యోగ సంఘాలు గురువారం సమ్మె నోటీసు అందజేశాయి. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల జనరల్‌ మేనేజర్లకు ఎక్కడికక్కడ సమ్మె నోటీసులు అందజేశారు. భారతీయ రైల్వేలో 42 ఏళ్ల తర్వాత సమ్మె సైరన్‌ మోగనుంది.

Pages