జాతీయ వార్తలు

బల్యన్‌ను తక్షణం తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు లేకుండా దాద్రీ దురాగతం జరగదని, దాని అనంతర పరిణామాల వెనుక కూడా ఆయన మద్దతు ఉందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక మోదీ హస్తం ఉందని ఆరోపించిన ఏచూరి, బల్యాన్‌ను తక్షణం కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దేశంలో జరుగుతున్న మతపరమైన హింసాత్మక ఘటనల వెనుక ప్రధాని మోదీ ప్రమేయం ఉందని, దాద్రీ ఘటనలోనూ ఆయన ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని ఏచూరి స్పష్టం చేశారు. రెండేళ్ల మోదీ పాలనపై సిపిఎం రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల క్రితం పార్లమెంటును ప్రజాస్వామ్య ఆలయంగా మోదీ అభివర్ణించారని, కానీ ప్రస్తుతం బిజెపి నేతలు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతమున్న చట్టాలు అమలయ్యేలా చూడాలని తాము రెండేళ్ల క్రితం ప్రధాని మోదీని కోరామని, దానికి బదులుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెరిగాయని ఏచూరి పేర్కొన్నారు. చట్టాల అమలుపై ప్రధాని మోదీ ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారని, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని ఏచూరి ప్రశ్నించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బల్యన్‌ను తక్షణం పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మోదీ సహకారం లేకుండా బల్యన్ అలాంటి వ్యాఖ్యలు చేయరని ఆమె అన్నారు.

చిత్రం రెండేళ్ల మోదీ పాలనపై సిపిఎం రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీతారాం ఏచూరి