జాతీయ వార్తలు

‘ఉడ్తాపంజాబ్’లో మార్పులు సరైనవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జూన్ 9: వివాదాస్పదంగా మారిన ‘ఉడ్తాపంజాబ్’ సినిమాలో తాము సూచించిన మార్పులు సరైనవేనని సెన్సార్ బోర్డు సమర్థించుకుంది. ఈ సినిమాలో ‘పంజాబ్’ సంకేత బోర్డును తొలగించాలని, దానితో పాటు మరో పదమూడు మార్పులను సూచించటం వెనుక ఔచిత్యంపై బాంబే హైకోర్టు గురువారం సెన్సార్‌బోర్టును ప్రశ్నించింది. జూన్ 17న విడుదల కావలసిన ఈ సినిమాలో అవసరమైన మార్పులను చేయాల్సిందన్న సెన్సార్‌బోర్డు ఆదేశాలను సవాలు చేస్తూ ‘ఉడ్తాపంజాబ్ ’ నిర్మాతలైన ఫాంటమ్ ఫిల్మ్స్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్.సి.్ధర్మాధికారి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. మాదక ద్రవ్యాలు అంశంగా రూపొందించిన ఉడ్తాపంజాబ్‌ను గతంలో విడుదలైన ‘గో గోవా గాన్’ అనే సినిమాతో పోలుస్తూ జస్టిస్ ధర్మాధికారి సెన్సార్‌బోర్డును ప్రశ్నించారు. ‘గో గోవా గాన్’లో ప్రజలు పార్టీలకు వెళ్లటం నిషిద్ధ మాదక ద్రవ్యాలను తీసుకోవటం చూపించారని, గోవాను మాదక ద్రవ్యాల కేంద్రంగా చూపించినప్పుడు ఉడ్తా పంజాబ్‌లో పంజాబ్‌ను చూపించటంలో తప్పేంటని ధర్మాధికారి సెన్సార్ బోర్డును అడిగారు. సెన్సార్ బోర్డు తరపు లాయర్ తన వాదనలు వినిపిస్తూ ‘‘పంజాబ్‌ను, అక్కడి ప్రజలను చూపించిన తీరు, ఉపయోగించిన భాష పట్ల మేం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం’’ అని న్యాయవాది న్యాయమూర్తికి విన్నవించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ చండీగఢ్, అమృత్‌సర్, తరన్‌తరన్, జషన్‌పురా, మోగా, లూథియానాల ప్రస్తావనలను తొలగించాలన్న సెన్సార్ బోర్డు తొలి రెండు సూచనలతోతాము సంతృప్తిగా లేమని అన్నారు. దీనిపై తాను శుక్రవారం తన వాదనలను సమర్పిస్తానని సెన్సార్ బోర్డు న్యాయవాది అన్నారు. సెన్సార్‌కు సంబంధించిన మార్గదర్శకాల పరిధిలోనే నిర్ణయాలు తీసుకున్నామని న్యాయవాది అన్నారు. కాగా ఉడ్తాపంజాబ్‌లో పంజాబ్ అభిన్న అంశమని, దాన్ని తొలగించటం సాధ్యం కానిపని అని ఫాంటమ్ ఫిల్మ్స్ తరపు న్యాయవాది రవి కాదమ్ అన్నారు.