జాతీయ వార్తలు

ఎయిడ్స్‌పై పోరులో భారత్ కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జూన్ 9: ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడానికి ఉపయోగిస్తున్న ఔషధాలలో 80 శాతం ఔషధాలను భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థలు సరఫరా చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జెపి నడ్డా తెలిపారు. తక్కువ వ్యయం అయ్యే జనరిక్ ఔషధాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో హెచ్‌ఐవి చికిత్సను ఎక్కువగా అందుబాటులోకి తేవడానికి తోడ్పడ్డాయని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో హెచ్‌ఐవి/ ఎయిడ్స్ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి జనరల్ అసెంబ్లీ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. భారత్ 15 ఏళ్ల క్రితం భయంకరమైన సాంక్రమిక వ్యాధి ఎయిడ్స్ వల్ల తీవ్రమైన విధ్వంసకర పరిణామాలను ఎదుర్కొందని, కాని నేడు ఆ సవాలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతోందని ఆయన వివరించారు. నేడు ఎయిడ్స్ వ్యాధిపై ప్రపంచం చేస్తున్న పోరాటంలో భారత్ గణనీయమైన పాత్ర పోషిస్తోందని, ఈ వ్యాధికి చికిత్సకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఔషధాలలో 80 శాతానికి పైగా భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపనీలే సరఫరా చేస్తున్నాయని ఆయన అన్నారు. హెచ్‌ఐవి/ఎయిడ్స్ మహమ్మారిని నియంత్రించడానికి ప్రజలు భరించగలిగే ధరల్లో ఔషధాల లభ్యత అనేది కీలకాంశమని పేర్కొనే ఒక రాజకీయ ప్రకటనను ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఎయిడ్స్ మహమ్మారి తిరిగి జడలు విప్పితే అంతర్జాతీయ సమాజం తట్టుకోజాలదని పేర్కొంటూ ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధిని నియంత్రించడానికి అభివృద్ధి చెందిన దేశాలు మరింత తీవ్రంగా కృషి చేయాలని నడ్డా పిలుపునిచ్చారు. భారత్‌లో ఎయిడ్స్ వల్ల మరణాలు 2007తో పోలిస్తే సుమారు 55 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. కొత్తగా హెచ్‌ఐవి వైరస్ సోకిన కేసులు 2000తో పోలిస్తే సుమారు 66 శాతం తగ్గాయని ఆయన వివరించారు.