S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/11/2016 - 19:40

దిల్లీ: ఏడు రాష్ట్రాల్లో 27 రాజ్యసభ స్థానాలకు శనివారం పోలింగ్ ముగిసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించగా ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభమైంది. రాజ్యసభలో మొత్తం 57 సీట్లు ఖాళీ కాగా, ఇదివరకే 30 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎపి నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

06/11/2016 - 19:38

జైపూర్: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు శనివారం జరిగిన ఎన్నికల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గెలుపొందారు. బిజెపి నుంచి ఆయనతో పాటు పోటీ చేసిన నలుగురు అభ్యర్థులూ గెలిచారు. వెంకయ్య గతంలో కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

06/11/2016 - 11:55

ముంబయి: నగరంలోని బాంబేహౌస్‌లో ప్రఖ్యాత టాటా సంస్థ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో కార్యాలయంలోని ఉద్యోగులు భయకంపితులై ఒక్కసారి బయటకు పరుగుతీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది బాంబేహౌస్‌కు చేరుకుని మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

06/11/2016 - 07:58

న్యూఢిల్లీ, జూన్ 10: దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి కేంద్రీకరించిన భారత్, జపాన్, అమెరికా శుక్రవారం దక్షిణ చైనా సముద్ర సమీపంలో సంయుక్తంగా నావికాదళ విన్యాసాలను ప్రారంభించాయి.

06/11/2016 - 07:08

న్యూఢిల్లీ/కోల్‌కతా, జూన్ 10: అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న భారతీయ మహిళను కాబూల్‌లో అనుమానిత ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కోల్‌కతాకు చెందిన జుదిత్ డిసౌజా కాబూల్‌లో ఆగాఖాన్ ఫౌండేషన్ సంస్థలో సీనియర్ సాంకేతిక సలహాదారుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆఫీసు బయట జుదిత్‌తో పాటు సెక్యూరిటీ గార్డు, డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. కాబూల్ నడిబొడ్డున తైమని ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

06/11/2016 - 07:07

ముంబయి, జూన్ 10: బాలీవుడ్ చిత్రం ‘ఉడ్తా పంజాబ్’ లో కొన్ని సన్నివేశాలు ‘చాలా అసభ్యకరం’గా ఉన్నాయని కేంద్ర సెన్సార్ బోర్డు (సిబిఎఫ్‌సి) సోమవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. ఈ చిత్రంలోని ‘జమీన్ బంజర్ తో ఔలాద్ కంజర్’ అనే డైలాగ్‌ను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటూ, ఇటువంటి అసభ్యకరమైన డైలాగ్‌లను, అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించి తీరాల్సిందేనని హైకోర్టుకు సెన్సార్ బోర్డు విజ్ఞప్తి చేసింది.

06/11/2016 - 07:03

లక్నో, జూన్ 10: భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చైనా, అమెరికాకన్నా కూడా భారత్ ఎక్కువ పెట్టుబడులు సుమారు 51 బిలియన్ డాలర్లను ఆకర్షించిందని ఆయన అన్నారు. మన దేశం ‘ఎకనమిక్ సూపర్‌పవర్’గా అవతరించే రోజు మరెంతో దూరంలో లేదని ఆయన అన్నారు.

06/11/2016 - 07:03

న్యూఢిల్లీ, జూన్ 10: ఢిల్లీలో రెండున్నరేళ్ల క్రితం డెన్మార్క్ నుంచి వచ్చిన ఒక పర్యాటకురాలిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన అయిదుగురు దోషులకు ఇక్కడి కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 52 ఏళ్ల డెన్మార్క్ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించింది.

06/11/2016 - 06:04

న్యూఢిల్లీ, జూన్ 10: న్యూఢిల్లీలోని ఆంధ్రా భవన్‌లో ఉద్యోగుల పనిదినాలను వారానికి ఐదు రోజులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వుల ప్రకారం ఏపీ భవన్ ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు.

06/11/2016 - 06:03

న్యూఢిల్లీ, జూన్ 10: ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ల ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌సిఐ), నెల్లూరులో క్యాన్సర్ తృతీయ చికిత్స కేంద్రం (టిసిసిసి) ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపాలని ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం లేఖ రాసింది.

Pages