S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/14/2016 - 02:00

న్యూఢిల్లీ, జూన్ 13: తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అనంద్ శర్మ దుయ్యబట్టారు. సోమవారం ఏఐసిసి కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, అధికారంలో ఉన్న పార్టీలు తమ మనుగడను కాపాడుకునేందుకు ఇతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవటం సిగ్గుచేటని విమర్శించారు.

06/13/2016 - 16:27

ముంబయి: యూఎస్‌ ఫెడరల్‌ ఓపెన్ మార్కెట్‌ కమిటీ సమావేశం నేపథ్యంలో అమెరికా, ఐరోపా స్టాక్‌ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీని ప్రభావం భారత మార్కెట్లపై కూడా కనిపించింది. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 30,300లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 41,075లుగా ఉంది.

06/13/2016 - 16:06

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమై, చివరికి నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 239 పాయింట్లు నష్టపోయి 26,397 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 8,111 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో బీపీసీఎల్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 2.45శాతం లాభపడి రూ.1,011 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.13 వద్ద కొనసాగుతోంది.

06/13/2016 - 14:28

అలహాబాద్: వచ్చే ఏడాది జరిగే యుపి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకునేలా పార్టీ ఎంపీలు, నాయకులు వ్యూహాత్మకంగా పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, పార్టీని ఇబ్బందులపాలు చేసేలా నేతలెవరూ వ్యవహరించరాదని, ప్రజలను ఆకట్టుకునేందుకు కష్టించి పనిచేయాలన్నారు.

06/13/2016 - 14:25

లక్నో: మథుర పట్టణంలో ఇటీవల హింసాకాండ చోటుచేసుకున్న ప్రాంతంలో యుపి సిఎం అఖిలేష్ యాదవ్ సోమవారం పర్యటించారు. మథురలోని జవహర్‌బాగ్ పార్కును ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించగా జరిగిన అల్లర్లలో ఇద్దరు పోలీసు అధికారులు సహా 29 మంది మరణించిన సంగతి తెలిసిందే.

06/13/2016 - 14:25

జైపూర్: భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ విమానం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వద్ద సోమవారం ఉదయం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్లు క్షేమంగా బయటపడగా, ముగ్గురు గాయపడ్డారు. ఫైటర్ జెట్ పురాతనమైనది కావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

06/13/2016 - 12:35

రాంచీ (ఝార్ఖండ్): పశుదాణా కేసులో నిధుల దుర్వినియోగం విషయమై సాక్ష్యం ఇచ్చేందుకు బిహార్ మాజీ సిఎం, ఆర్‌జెడి పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సోమవారం ఉదయం ఇక్కడి సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ట్రజరీ కార్యాలయం నుంచి 3.31 కోట్ల నిధులను విత్‌డ్రా చేసిన వ్యవహారంలో ఆయనను సిబిఐ న్యాయమూర్తి ప్రశ్నించారు.

06/13/2016 - 06:56

న్యూఢిల్లీ, జూన్ 12: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలంటే గాంధీజీ సిద్ధాంతాలే శిరోధార్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ‘దక్షిణాఫ్రికాలో మహోత్మోదయం’ పేరుతో డా.యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ రచించిన హిందీ, తెలుగు గ్రంథాల ఆవిష్కరణ భారత దౌత్య కార్యలయంలో వివిధ సాంస్కృతిక సంస్థల సంయుక్త సారధ్యంలో లండన్‌లోని నెహ్రూ సెంటర్‌లో ఆదివారం జరిగింది.

06/13/2016 - 06:55

న్యూఢిల్లీ, జూన్ 12: ప్రముఖ పాత్రికేయుడు ఇందర్ మల్హోత్రా అంత్యక్రియలు ఆదివారం ఢిల్లీలోని లోధీ లోడ్ శ్మశాన వాటికలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర ప్రముఖులు, సహచర జర్నలిస్టులు భారీగా తరలివచ్చారు. ఇందర్ మల్హోత్రా కుమారుడు అనిల్ రెవ్రీ ఉదయం 11 గంటల సమయంలో ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తిచేశారు.

06/13/2016 - 06:55

న్యూఢిల్లీ, జూన్ 12: దేశం నుంచి వెలువడుతున్న ఒకే ఒక సంస్కృత దినపత్రిక నిధుల లేమితో సతమతమవుతోంది. ‘సుధర్మ’ పేరుతో మైసూరు నుంచి వెలువడుతున్న ఈ పత్రికకు ప్రస్తుతం 3000 కాపీల సర్క్యులేషన్ మాత్రమే ఉంది.

Pages