S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/14/2016 - 17:04

సిమ్లా: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన కుమార్తె ప్రియాంకతో పాటు ప్రస్తుతం సిమ్లా (హిమాచల్ ప్రదేశ్)లో బస చేశారు. అక్కడి ఛారబ్రా ప్రాంతంలో ప్రియాంక నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు సోనియా వెళ్లారు. ఆ ఇంటికి సమీపంలోని ఓ హోటల్‌లో ఇద్దరూ బస చేశారు. ఇంటి నిర్మాణం పనులను వారు మంగళవారం నాడు సుమారు రెండు గంటల సేపు పరిశీలించారు. సోనియా రాకతో ఆ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

06/14/2016 - 17:03

దిల్లీ: ప్రీమియం బస్సు సర్వీసుల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్‌రాయ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆరోగ్య కారణాల రీత్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. అవినీతి ఆరోపణలను ఎవరైనా రుజువు చేస్తే జైలుకు వెళ్లడానికి తాను సిద్ధమేనని ఆయన సవాల్ చేశారు.

06/14/2016 - 16:52

కోల్‌కతా : జీఎస్‌టీపై (వస్తు సేవల బిల్లు) తమిళనాడు మినహా దాదాపు అన్ని రాష్ట్రాలూ మద్దతిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. జీఎస్‌టీపై కోల్‌కతాలో మంగళవారం 22రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఏడు రాష్ట్రాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం ప్రకటించారు. లోక్‌ సభలో పాసైన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది.

06/14/2016 - 06:30

న్యూఢిల్లీ, జూన్ 13: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జిగా కమలనాథ్ నియమితుడు కావడంతో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆయన పాత్ర మరోసారి చర్చనీయాంశమయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కమలనాథ్‌పై దాడికి ఈ అంశాన్ని ఉపయోగించుకుంది. ఆప్ నాయకుడు, 1984 నాటి అల్లర్లలో బాధితుల పక్షాన వాదిస్తున్న న్యాయవాది హెచ్‌ఎస్ ఫూల్కా..

06/14/2016 - 05:17

అలహాబాద్, జూన్ 13: బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి వెల్లువెత్తుతోందని..అద్భుతమైన ప్రగతి ర్యాంకింగ్‌లు సాధిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బిజెపి రెండురోజుల కార్యనిర్వాహక వర్గం ముగింపు సందర్భంగా ఇక్కడ సోమవారం జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు.

06/14/2016 - 04:52

న్యూఢిల్లీ, జూన్ 13: కృష్ణా బోర్డు వ్యవహారంపై రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని చక్కదిద్దేందుకు కేంద్రం సమాయత్తమైంది. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఈనెల 21న రెండు రాష్ట్రాల సాగునీటి మంత్రులు, అధికారులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణాపై నిర్మించిన నీటినీటి ప్రాజెక్టుల నిర్వహణను తమ పరిధిలోకి తెచ్చుకునేందుకు వీలుగా బోర్డు మే 27న ఒక ముసాయిదాను ప్రతిపాదించటం తెలిసిందే.

06/14/2016 - 04:49

అలహాబాద్, జూన్ 13: మరో మూడేళ్లలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు బిజెపి పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ క్షీణిస్తోందని, వర్తమానం, భవిత కూడా తమదేనని ఉద్ఘాటించింది. రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్య నిర్వాహక వర్గం సమావేశం ముగింపు సందర్భంగా సోమవారం ఈ మేరకు ఓ తీర్మానాన్ని చేపట్టింది.

06/14/2016 - 03:47

చండీగఢ్, జూన్ 13: కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే నెల రోజుల్లోనే పంజాబ్‌లో మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేస్తామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జలంధర్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన జరిగిన ధర్నాలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

06/14/2016 - 03:48

ముంబయి, జూన్ 13: కేంద్ర సెన్సార్ బోర్డు (సిబిఎఫ్‌సి)తో వివాదంలో చిక్కుకున్న ‘ఉడ్తా పంజాబ్’ చిత్రానికి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సోమవారం తీర్పును వెలువరించిన హైకోర్టు కేవలం ఒకే ఒక్క (మూత్ర విసర్జన) దృశ్యాన్ని కత్తిరించి ఈ చిత్రాన్ని విడుదల చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

06/14/2016 - 02:58

జోధ్‌పూర్, జూన్ 13: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-27 విమానం రాజస్థాన్‌లో కూలిపోయింది. అయితే పైలెట్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. జోధ్‌పూర్‌లోని మహావీర్‌నగర్ బహిరంగ ప్రదేశంలో ఓ ఇంటిపక్కనే విమానం కూలిపోయిందని బన్సీ పోలీసుస్టేషన్ ఎస్‌ఐ రాజేష్ యాదవ్ తెలిపారు. రోజువారీ శిక్షణ కార్యక్రమంలో భాగంగానే విమానం గాలిలో ఎగురుతుండగా సాంకేతిక సమస్య తలెత్తిందని అన్నారు.

Pages