S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/17/2016 - 06:30

న్యూఢిల్లీ, జూన్ 16: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు అల్లర్ల భూతం కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌ను ఇప్పటికీ వెలండాడుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న పంజాబ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం కమల్‌నాథ్‌ను పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమించినప్పటికీ ఆయన రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోక తప్పలేదు. ఒక దశలో ఆయనపై కేసు పెట్టడానికి కూడా వారు సిద్ధమయ్యారు.

06/17/2016 - 06:28

న్యూఢిల్లీ, జూన్ 16: ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లపాటు ఏకబిగిన పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్‌కు కాంగ్రెస్ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించనుందా? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమెను బరిలోకి దింపనుందా? వీటికి సంబంధించి గురువారం ఊహాగానాలు ఊపందుకున్నాయి.

06/17/2016 - 06:25

న్యూఢిల్లీ/ముంబై జూన్ 16: ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్ వివాదం మరోసారి రాజుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి అదృశ్యమైన కొన్ని ఫైళ్లపై జరుగుతున్న విచారణలో జవాబులివ్వాల్సిన ముఖ్యమైన సాక్షి ఏ విధంగా మాట్లాడాలో ఓ అధికారి అతనికి బోధన చేశారంటూ వచ్చిన వార్తలు వివాదాస్పదమయ్యాయి.

06/17/2016 - 06:25

న్యూఢిల్లీ, జూన్ 16: భారత దేశాన్ని ‘ప్రపంచ వ్యూహాత్మక, రక్షణ భాగస్వామి’గా గుర్తించాలని కోరే కీలకమైన సవరణను అమెరికా సెనేట్ తిరస్కరించడం అంత సీరియస్‌గా తీసుకోవలసిన విషయమేమీ కాదని, దాని తుది స్వరూపం ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహాగానాలు చేయడం తొందరపాటే అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది.

06/17/2016 - 06:15

సూళ్లూరుపేట, జూన్ 16: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో పిఎస్‌ఎల్‌వి -సి 34 రాకెట్ ప్రయోగాన్ని వాయిదావేశారు. మూడోదశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాన్ని సరిచేయడానికి రెండురోజులపాటు వాయిదా వేశారు.

,
06/17/2016 - 06:13

న్యూఢిల్లీ, జూన్ 16: సాధారణంగా కిలో ఇరవై, ముప్ఫై రూపాయలు ఉండే సామాన్యుడి నిత్యావసర సరకుల్లో ఒకటైన టమోటా ఇప్పుడు దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో 80నుంచి వందరూపాయల దాకా పలుకుతుండడంతోఏమి కొని తినాలని గృహిణులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆగస్టు నెల చివరికి కానీ కొత్త పంట మార్కెట్లోకి వచ్చే అవకాశం లేనందున మరో రెండు నెలల పాటు టమోటా ధరలు ఎక్కువగానే ఉండే అవకాశముందని కేంద్రం అంటోంది.

06/17/2016 - 04:13

న్యూఢిల్లీ, జూన్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెలాఖరులో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయనున్నట్టు తెలిసింది. అయితే ఈ మార్పులు ఏ స్థాయిలో ఉంటాయనేది స్పష్టం కావడం లేదు. పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినా ఆశ్చర్యపడాల్సింది లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో మార్పులపై నాలుగైదు నెలల నుంచే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

06/16/2016 - 18:15

లక్నో: హైకోర్టు ఆదేశాలను యుపి ప్రభుత్వం పాటించకపోవడం వల్లే ఇటీవల మథురలో అల్లర్లు జరిగాయని ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ గురువారం కాన్పూరులో మీడియాతో అన్నారు. మథురలోని జవహర్‌బాగ్ పార్కును కోర్టు ఆదేశాల మేరకు ఎపుడో ఖాళీ చేయించి ఉంటే ఇద్దరు పోలీసు అధికారులు సహా 29 మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కారన్నారు. కోర్టు ఆదేశాలు అమలు కానందునే ఈ దారుణం జరిగిందన్నారు.

06/16/2016 - 18:14

దిల్లీ: పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నోరు జారినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబాపై అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధికార ప్రతినిధి నుంచి రెండు నెలల పాటు ఆమెను తప్పిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. దిల్లీ రవాణా మంత్రి గోపాల్‌రాయ్ రాజీనామా విషయమై ఆమె అత్యుత్సాహంగా మాట్లాడడం అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది.

06/16/2016 - 18:12

దిల్లీ: కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూడడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడి బిజెపి ప్రధాన కార్యాలయం ముందు వారు గురువారం ధర్నా చేశారు. కూరగాయలతో చేసిన దండలను మెడలో వేసుకుని ఖాళీ భోజనం ప్లేట్లతో మహిళలు ఆందోళనకు దిగారు.

Pages