S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/16/2016 - 07:39

న్యూఢిల్లీ, జూన్ 15: పరిపాలనలో పారదర్శకతను తీసుకు వచ్చేందుకు యుపిఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం దేశంలోని ఏ వ్యక్తి కోరినా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి తీరాల్సి ఉంటుంది. రక్షణ వ్యవహారాలులాంటి కొన్ని కీలకమైన అంశాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది.

06/16/2016 - 06:33

న్యూఢిల్లీ,జూన్ 15: తెలంగాణ రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పోలియో వైరస్ కనిపించిందంటూ వచ్చిన వార్తలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జె పి నడ్డా ఖండించారు. ఇది కేవలం వ్యాక్సీన్ డిరైవ్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ మాత్రమేనని ఆయన చెప్పారు. వ్యాక్సీన్ డిరైవ్డ్ పోలియో వైరస్ నమోదు అయినంత మాత్రాన భారత దేశం పోలియో విముక్తమైందనే పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదని నడ్డా ప్రకటించారు.

06/16/2016 - 06:29

న్యూఢిల్లీ, జూన్ 15: పౌర విమాన యాన రంగాన్ని అభివృద్ధికి ఊతాన్నిచ్చే కొత్త ఏవియేషన్ విధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. అలాగే నిపుణుల సేవల్ని మరికొంత కాలం ఉపయోగించుకునే లక్ష్యంతో సిజిహెచ్ వైద్యుల పదవీ కాలాన్ని 62నుంచి 65 సంవత్సరాలకు పెంచడంతో పాటు పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.

06/15/2016 - 17:07

దిల్లీ: స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాలో 5 అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర మంత్రిమండలి బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎస్‌బిఐలో స్టేట్‌బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్‌బ్యాంకు ఆఫ్ పాటాయాలా, స్టేట్‌బ్యాంకు ఆఫ్ మైసూరు, స్టేట్‌బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌తో పాటు భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసేందుకు మార్గం సుగమమైంది.

06/15/2016 - 17:04

శ్రీనగర్: జమ్మూలోని రూప్‌నగర్ ప్రాంతంలో ఓ పురాతన ఆలయం ధ్వంసమైన నేపథ్యంలో ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పురాతన ఆలయంలో ప్రవేశించి అక్కడి నిర్మాణాలను ధ్వంసం చేయడంతో స్థానికులు మూడు వాహనాలకు నిప్పు పెట్టి పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు.

06/15/2016 - 17:03

కొల్లం: కేరళలోని కొల్లం జిల్లా కోర్టు, కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం ఓ నాటు బాంబు పేలింది. ఆగంతకులెవరో ఆ బాంబును ఓ జీపుకింద అమర్చారు. బాంబు పేలడంతో కోర్టుకు వచ్చిన సాబూ అనే వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్‌ను రప్పించి సోదాలు జరిపారు. కలకలం సృష్టించాలన్న ఉద్దేశంతోనే ఎవరో ఈ బాంబును అమర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

06/15/2016 - 16:42

మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథుర అల్లర్లలో కీలక పాత్ర పోషించిన చందన్‌ బోస్‌, అతడి భార్యను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ కృపా శంకర్‌ సింగ్‌ తెలిపారు. అల్లర్ల వెనక ప్రధాన పాత్రధారి అయిన రామ్‌వృక్ష్ యాదవ్‌ పోలీసు కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అల్లర్ల వెనుక రామ్‌వృక్ష్ యాదవ్‌తోపాటు చందన్‌ బోస్‌, గిరీశ్‌ యాదవ్‌, రాఖేశ్‌ గుప్తాలు ఉన్నారని ఎస్పీ చెప్పారు.

06/15/2016 - 16:32

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. లాభాలతోనే ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు చివరి వరకు అదే దూకుడును ప్రదర్శించాయి. సెన్సెక్స్‌ 331 పాయింట్లు లాభపడి 26,726 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 8,207 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ఎన్‌టీపీసీ సంస్థ షేర్లు అత్యధికంగా 4.45శాతం లాభపడి రూ.154.85 వద్ద ముగిశాయి.

06/15/2016 - 16:13

ఢిల్లీ : సికింద్రాబాద్‌లో గుర్తించిన పోలియో వైరస్ వ్యాక్సిన్ కారణంగా ఏర్పడ్డదేనని, ఈ వైరస్ ప్రభావానికి చిన్నారులెవరూ గురికాలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, జూన్ 20న రెండు జిల్లాల్లో 3లక్షల చిన్నారులకు పోలియో వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

06/15/2016 - 14:16

బెంగళూరు: బెంగళూరు ఎయిర్‌పోర్టులో బుధవారం ఉదయం పది గంటలకు బయలుదేరిన విమానంలో ఆకస్మికంగా పొగలు రావడంతో దాన్ని వెంటనే కిందకు దింపారు. మంగళూరు వెళ్లాల్సిన ఈ విమానంలో 65 మంది ప్రయాణీకులు,నలుగురు సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో పొగలు రావడంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. క్యాబిన్‌లో నుంచి పొగలు రావడంతో 10-20 గంటలకు విమానం తిరిగి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగింది.

Pages