S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/16/2016 - 18:10

గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పర్యటన సందర్భంగా హార్దిక్ పటేల్ కుటుంబ సభ్యులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. హార్దిక్‌స్వగ్రామంలో సిఎం ఆనందిబెన్ గురువారం పర్యటించారు.

06/16/2016 - 17:58

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని సనంద్‌ ప్రాంతంలోని టాటా నానో కార్ల తయారీ కర్మాగారంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. విడి భాగాలు రూపొందించే ప్రాంతంలో మంటలు చెలరేగాయని, మంటలు అదుపులోకి వచ్చాయని టాటా మోటార్స్‌ అధికార ప్రతినిధి తెలిపారు. 12 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశాయి

06/16/2016 - 17:53

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో తాంగ్‌ధర్‌ సెక్టార్‌ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ జవాను చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

06/16/2016 - 17:12

దిల్లీ: బాలీవుడ్‌ చిత్రం ఉడ్తాపంజాబ్‌ సినిమా విడుదలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారం సినిమాను రేపు విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఎన్నో వివాదాల అనంతరం ఇటీవల సెన్సార్‌బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. అయితే చిత్ర విడుదలపై స్టే విధించాలని కోరుతూ పంజాబ్‌కు చెందిన ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

06/16/2016 - 17:10

ముంబయి: బాలీవుడ్‌ నటి జియా ఖాన్‌ది ఆత్మహత్యేనని ముంబయి హైకోర్టుకు సీబీఐ గురువారం వెల్లడించింది. మౌఖిక, డాక్యుమెంటరీ, సైంటిఫిక్‌, ఫోరెన్సిక్‌ సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సీబీఐ తెలిపింది. ఇకపై ఈ కేసులో తదుపరి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. 2013, జూన్‌ 3న జియాఖాన్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

06/16/2016 - 17:06

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 400 పాయింట్ల భారీ నష్టంతో ట్రేడయింది. అయితే మార్కెట్లు ముగిసే సమయానికి కాస్త తేరుకున్నా నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 201 పాయింట్లు నష్టపోయి 26,525 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో 8,141 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.22 వద్ద కొనసాగుతోంది.

06/16/2016 - 15:51

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జి పదవికి కమల్‌నాథ్ గురువారం రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే కొనసాగుతానని ఆయన ప్రకటించారు. 1984లో పంజాబ్‌లో సిక్కుల ఊచకోతకు కమల్‌నాథ్ కారకుడని ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీదళ్, బిజెపి ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

06/16/2016 - 15:09

శ్రీహరికోట: సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పీఎస్‌ఎల్‌వీ సీ-34 వాహక నౌక ప్రయోగం వాయిదా పడింది. ఈనెల 20 ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.

06/16/2016 - 07:43

న్యూఢిల్లీ, జూన్ 15: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వంతో సమానంగా రాష్ట్రాలకూ బాధ్యత ఉందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పప్పు ధాన్యాల ధరలు పెరుగుదల నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చెలరేగడంతో ‘్ధరల నియంత్రణ బాధ్యత మాకే కాదు, మీకూ ఉంది’ అని వెల్లడించారు.

06/16/2016 - 07:39

న్యూఢిల్లీ, జూన్ 15: మురుగు నీటిని శుద్ధిచేసి వ్యవసాయానికి వాడుకోనే పరిజ్ఞానాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరిజ్ఞానాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయంతో ఇక్రిశాట్ మరో 11 సంస్థలతో కలిసి ఈ పరిశోధనలు చేపట్టింది.

Pages