S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/19/2016 - 06:32

చెన్నై, జూన్ 18: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అన్నాడిఎంకె రానున్న స్థానిక పోరులోనూ అదే దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించింది. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఓ రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నాయి. అన్నాడిఎంకె అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత సమావేశానికి హాజరయ్యారు.

06/19/2016 - 06:30

కోట, జూన్ 18: బిహార్‌కు చెందిన ఆ సోదరులిద్దరు అంగవైకల్యాన్ని, పేదరికాన్ని జయించి తమ లక్ష్యాన్ని సాధించారు. ఆరు నెలల వయసులోనే పోలియో బారిన పడి వికలాంగుడిగా మారిన కృషన్ (19)ను పాఠశాల విద్య నుంచే అతని తమ్ముడు బసంత్ కుమార్ పండిట్ (18) తన భుజాలపై మోసుకుంటూ వస్తున్నాడు. గత మూడేళ్లుగా కోచింగ్ సెంటర్‌కు కూడా తన భుజాలపైనే మోసుకుంటూ తీసుకెళ్లి, తిరిగి తీసుకొస్తున్నాడు.

06/19/2016 - 02:29

హైదరాబాద్: వాయుసేన చరిత్రలో నూతనాధ్యాయం మొదలైంది. యుద్ధ విమాన పైలట్లు (ఐఏఎఫ్ ఫైటర్ స్క్వాడ్రన్)గా ముగ్గురు మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో శనివారం నాటి గ్రాడ్యుయేటింగ్ ట్రైనీల పాసింగ్ ఔట్ పరేడ్‌లో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా పత్రాలు అందుకుని ‘్భరత వాయుసేన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదిగిన రోజు ఇది’ అని ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు.

06/19/2016 - 02:43

హైదరాబాద్, జూన్ 18: భారత వాయుసేనను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేస్తున్నామని, వాయుసేనలో చేరిన యువ పైలెట్లు దేశం సైనికపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను వీరోచితంగా తిప్పిగొట్టాలని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పిలుపునిచ్చారు.

06/19/2016 - 02:16

న్యూఢిల్లీ, జూన్ 18: ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త విద్యా విదానం కింద పాఠశాలల్లో యోగాకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి (2016-17) ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యోగా విభాగాలు ప్రారంభమవుతున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

06/18/2016 - 18:13

ముంబయి: రెండోసారి పదవిలో కొనసాగేందుకు తనకు ఇష్టం లేదని రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ శనివారం తన అంతరంగాన్ని బహిర్గతం చేశారు. ఆయన తీసుకున్న కీలక నిర్ణయం బ్యాంకింగ్ రంగంలో ఇపుడు చర్చనీయాంశమైంది. తన తర్వాత ఆర్‌బిఐ గవర్నర్‌గా వచ్చే వ్యక్తి మంచి ఫలితాలను సాధించాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

06/18/2016 - 18:11

బెంగళూరు: కర్నాటక మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎట్టకేలకు పచ్చజెండా ఊపారు. మంత్రివర్గం ప్రక్షాళన విషయమై కర్నాటక సిఎం సిద్ధరామయ్య, కెపిసిసి అధ్యక్షుడు పరమేశ్వర్ శుక్ర, శనివారాల్లో దిల్లీలో సోనియా, రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌లతో మంతనాలు జరిపారు.

06/18/2016 - 17:52

ముంబయి: రూ.2వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ కుంభకోణంలో బాలీవుడ్‌ నటి మమతాకులకర్ణి పేరును మహారాష్ట్ర పోలీసులు చేర్చారు. మమతా కులకర్ణికి ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే పది మంది అరెస్టయ్యారు. డ్రగ్‌ రాకెట్‌కు మమత, ఆమె భర్త విక్కీ ప్రధాన సూత్రధారులని తేలిందని థానే పోలీసు అధికారి పరమ్‌వీర్‌ సింగ్‌ వెల్లడించారు.

06/18/2016 - 17:03

దిల్లీ: అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1.57శాతం పెరిగి 1,298.10 యూఎస్‌ డాలర్లకు చేరింది. తగ్గిందనుకున్న పసిడి ధర శనివారం రూ.150 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,800కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

06/18/2016 - 16:48

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా వద్ద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక నిర్మిస్తున్న ఇంటిపై వివాదాలు ముసురుకుంటున్నాయి. రాష్టప్రతి వేసవి విడిదికి సమీపంలో ప్రియాంక ఇంటి నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని బిజెపి ఎమ్మెల్యే సురేష్ భరద్వాజ్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. రాష్టప్రతి విడిది ఉన్నందున ఆ ప్రాంతం హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

Pages