జాతీయ వార్తలు

వైకల్యాన్ని, పేదరికాన్ని జయించిన సోదరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, జూన్ 18: బిహార్‌కు చెందిన ఆ సోదరులిద్దరు అంగవైకల్యాన్ని, పేదరికాన్ని జయించి తమ లక్ష్యాన్ని సాధించారు. ఆరు నెలల వయసులోనే పోలియో బారిన పడి వికలాంగుడిగా మారిన కృషన్ (19)ను పాఠశాల విద్య నుంచే అతని తమ్ముడు బసంత్ కుమార్ పండిట్ (18) తన భుజాలపై మోసుకుంటూ వస్తున్నాడు. గత మూడేళ్లుగా కోచింగ్ సెంటర్‌కు కూడా తన భుజాలపైనే మోసుకుంటూ తీసుకెళ్లి, తిరిగి తీసుకొస్తున్నాడు. పేద కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు సోదరులు ఐఐటి ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకులు పొంది ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇటీవల విడుదలయిన జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలలో జాతీయ స్థాయిలో ఒబిసి కేటగిరీలో కృషన్ 38వ ర్యాంకును, భరత్ 3675వ ర్యాంకును సాధించారు. వారి తండ్రి మదన్ పండిట్‌కు సమస్తిపూర్‌లోని పరోరియా గ్రామంలో కేవలం అయిదు బిగాల భూమి ఉంది. తల్లి గృహిణి. ఇంజనీర్లు కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సోదరులు మూడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఒక కోచింగ్ సెంటర్‌లో చేరారు. మొదటి ప్రయత్నంలో విఫలమైన వీరిని ఇంటికి రమ్మని తండ్రి చెప్పాడు. అయితే ముంబయిలోని ఓ గ్యారేజ్‌లో పనిచేస్తున్న వారి అన్నయ్యలు ఆర్థికంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండో ప్రయత్నంలో తమ లక్ష్యం సిద్ధించడంతో ఈ సోదరులిద్దరు ఎంతో సంతోషిస్తున్నారు. అయితే ర్యాంకుల మధ్య తేడా వల్ల వేర్వేరు కళాశాలల్లో ఇంజనీరింగ్ కోర్సు చేయాల్సి వస్తుండటం వల్ల ఇప్పుడు విడిపోవడం తామిద్దరినీ ఎంతో బాధిస్తోందని వారు తెలిపారు. కంప్యూటర్ ఇంజనీర్‌ను కావాలని తాను కోరుకుంటుండగా, బసంత్ మాత్రం సివిల్ సర్వీసెస్‌లో చేరాలని కోరుకుంటున్నాడని కృషన్ తెలిపారు.