జాతీయ వార్తలు

స్థానిక ఎన్నికలపై అన్నాడిఎంకె గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 18: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అన్నాడిఎంకె రానున్న స్థానిక పోరులోనూ అదే దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించింది. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఓ రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నాయి. అన్నాడిఎంకె అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత సమావేశానికి హాజరయ్యారు. ఇ మధుసూదనన్ అధ్యతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ‘త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పనిచేయాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం కావాలి’ అని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ తీర్మానం ఆమోదించారు. తమిళ ప్రజల ఆదరాభిమాలు చూరగొని ఆరుసార్లు ముఖ్యమంత్రి అయిన జయలలితకు కార్యవర్గం అభినందనలు తెలిపింది.