S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/21/2016 - 06:46

న్యూఢిల్లీ, జూన్ 20: ‘ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ద్వారాలు దాదాపుగా తెరుచుకున్నాయి. ఎఫ్‌డిఐలకు భారత దేశమే నెంబర్ వన్ గమ్యస్థానం. ఇది అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు నిగ్గుదేల్చిన నిజం’ అని రెండో దశ ఆర్థిక సంస్కరణలకు సోమవారం శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ ట్వీట్‌లలో చేసిన వ్యాఖ్యలివి.

06/21/2016 - 06:42

న్యూఢిల్లీ, జూన్ 20: వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తాజా చర్యలకు ఉపక్రమించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోమవారం ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లోని దాదాపు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి ఈ కేసుతో ప్రమేయం ఉన్న వివిధ సంస్థలకు చెందిన రూ.86 కోట్లకు పైగా విలువచేసే విదేశీ షేర్లను స్తంభింప జేసింది.

06/20/2016 - 18:12

దిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న (మంగళవారం) సెలవు ప్రకటించలేదని, కార్యాలయాలన్నీ యథావిధిగా పనిచేస్తాయని కేంద్రం ప్రకటించింది. ఉద్యోగులు స్వచ్ఛందంగా కార్యాలయాల్లో జరిగే యోగా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని పేర్కొంది. తప్పనిసరిగా యోగాలో పాల్గొనాలన్న నిబంధన కూడా లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

06/20/2016 - 18:05

దిల్లీ: సోమవారం పసిడి ధర రూ.150 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,650కి చేరింది. కీలక సమయాల్లో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1.4శాతం తగ్గి 1,280.47 యూఎస్‌ డాలర్లకు చేరింది.

06/20/2016 - 17:35

బెంగళూరు: కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇంఛార్జ్‌గా దినేశ్ గుండూరావ్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తీసుకోవాల్సిన వ్యూహాలను దినేశ్ గుండూరావ్ అమలుచేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక ఒక్కటే.

06/20/2016 - 17:28

పాట్నా: బీహార్ ఇంటర్ టాపర్స్ స్కామ్‌లో స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు మాజీ ఛైర్మన్ లాల్ కేశ్వర్ ప్రసాద్ సింగ్, ఆయన భార్య, జేడీయూ మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాను ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారం అదుపులోకి తీసుకుంది. 12 తరగతి ఆర్ట్స్, సైన్స్‌ ఫలితాల్లో మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఓ టీవీ ఛానల్ ఇంటర్వూ చేయగా పొంతన లేని సమాధానాలు చెప్పారు.

06/20/2016 - 16:25

ముంబయి: అంచనాలను మారుస్తూ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌లు కొద్దిసేపటికే లాభాల బాటపట్టాయి. చివరికి సెన్సెక్స్‌ 241 పాయింట్లు లాభపడి 26,867 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 8,238 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.38 వద్ద కొనసాగుతోంది.

06/20/2016 - 16:07

బెంగళూరు: కర్నాటక మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ నాయకుడు ఎంహెచ్ అంబరీష్ సోమవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, తన రాజీనామా లేఖను వ్యక్తిగతంగా కాకుండా తన సహాయకుడి ద్వారా డిప్యూటీ స్పీకర్‌కు పంపారు. దీంతో రాజీనామాను ఆమోదించడం లేదని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. కర్నాటక సిఎం సిద్ధరామయ్య తన క్యాబినెట్ నుంచి అంబరీష్ సహా 14 మంది మంత్రులకు ఆదివారం ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.

06/20/2016 - 16:06

దిల్లీ: తన దెబ్బకు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ విరమణ అనంతరం విదేశాలకు పోతున్నాడని, ఇక దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇంటిబాట పట్టేందుకు తాను దృష్టి సారించానని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఎన్‌డిఎంఎ అధికారి హత్య కేసులో బిజెపి ఎంపీ మహేష్ గిరి హస్తం ఉందని కేజ్రీవాల్ ఆరోపించడంపై స్వామి ఆగ్రహం వ్యక్తం చేశరు.

06/20/2016 - 16:05

దిల్లీ: అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా ‘సూర్య నమస్కార్’ పేరుతో ఓ ప్రత్యేక పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేశారు. ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టెలికాం మంత్రి రవిశంకర ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Pages