S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/22/2016 - 01:42

న్యూఢిల్లీ, జూన్ 21: భారతీయ మహిళలు అత్తగారింట బైటికి చెప్పుకోలేని ఆరళ్లు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గర్భిణి అయిన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించి ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేసినందుకు అయిదేళ్ల జైలుశిక్ష పడిన ఒక వ్యక్తి పట్ల ఉదారంగా వ్యవహరించేందుకు నిరాకరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

,
06/22/2016 - 00:30

దేశవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన యోగ ప్రత్యేక కార్యక్రమాల్లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. భోపాల్‌లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, జైపూర్‌లో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, అహ్మదాబాద్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్, పాండిచ్చేరిలో గవర్నర్ కిరణ్ బేడీ యోగాసనాలు వేసి అలరించారు.

,
06/22/2016 - 00:26

చండీగఢ్/న్యూఢిల్లీ, జూన్ 21: అంతర్జాతీయ యోగ దినోత్సవం దేశమంతటా అత్యద్భుతంగా కన్నుల పండువగా జరిగింది. లక్షలాది ప్రజలు వయోభేదం లేకుండా అన్ని రాష్ట్రాల్లో.. వివిధ ప్రాంగణాల్లో సామూహికంగా యోగ కార్యక్రమాల్లో భాగం పంచుకున్నారు. చండీగఢ్‌లో జరిగిన ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు.

06/22/2016 - 00:17

చండీగఢ్, జూన్ 21: పిల్లలతో పిల్లాడిలా, యువకులతో యువకుడిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మారిపోయారు. రెండో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చండీగఢ్ జరిగిన కార్యక్రమంలో ఆయన అందరితో కలివిడిగా కలిసిపోయారు. దాదాపు 30 వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో 150మంది దివ్యాంగులతోనూ ఆయన సరదాగా మాట్లాడారు. కొంతమందితో ఆసనాలు వేయించటంలో ఆయన సహకరించారు.

06/22/2016 - 00:15

న్యూఢిల్లీ, జూన్ 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను అత్యంత సరళీకృతం చేయటంద్వారా దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడవేసిందని సిపిఐ సెంట్రల్ సెక్రటేరియట్ ఆరోపించింది. సిపిఐ సెంట్రల్ సెక్రటేరియట్ మంగళవారం జారీ చేసిన ప్రకటనలో ఎన్‌డిఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.

06/22/2016 - 00:14

న్యూఢిల్లీ, జూన్ 21: పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు జారీచేయాలని, వాటిలో తప్పనిసరిగా ఆధార్‌కు జత చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఐదో తరగతి లేదా ఎనిమిది తరగతి స్థాయిలోనే విద్యార్థులందరికీ ఈ ధ్రువీకరణ పత్రాలను జారీచేయాలని, 60 రోజుల్లోగా విద్యార్థులకు అందజేయాలని కూడా స్పష్టం చేసింది.

06/22/2016 - 00:13

కుందాపూర్, జూన్ 21: ఉడిపి జిల్లా కుందాపూర్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సందడి సందడిగా ఓమ్ని వ్యాన్‌లో స్కూల్‌కు బయలుదేరిన ఎనిమిది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి 66పై ఓ ప్రైవేటు బస్సు స్కూల్ వ్యాన్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.

06/22/2016 - 00:11

ముంబయి, జూన్ 21: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ‘సుల్తాన్’ చిత్రం షూటింగ్‌కు సంబంధించి ఓ ఇంటర్‌వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చిత్రం షూటింగ్‌లో కుస్తీ పోటీ దృశ్యాలు షూటింగ్ తరువాత ‘అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి తానూ ఎదుర్కొన్నా’నని ఓ ఇంటర్‌వ్యూలో వ్యాఖ్యానించాడు. ఖాన్ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయంటూ పలు సంఘాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి.

06/22/2016 - 00:07

జమ్మూ, జూన్ 21: ఉగ్రవాదులు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు దగ్గర్లో ఉన్న గ్రామాల్లో దాక్కొని ఉన్నారని, వారినుంచి బేస్‌కు మరోసారి దాడి ముప్పు పొంచి ఉందని హోం శాఖకు చెందిన పార్లమెంటు స్థారుూ సంఘం పేర్కొంది. ఈ విషయం గురించి, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన బేస్‌కు భద్రతను పెంచాల్సిన అవసరం గురించి ప్రభుత్వానికి తెలియజేసినట్లు కూడా ఆ కమిటీ తెలిపింది.

06/21/2016 - 18:09

పూణె: కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న పూణెకు చెందిన ఆరేళ్ల బాలిక వైశాలికి ప్రధాని మోదీ లేఖ రాశారు. దేశం గర్వించేలా వైశాలి ఎదగాలని ఆ లేఖలో మోదీ ఆకాంక్షించారు. గుండెకు శస్తచ్రికిత్స చేయించుకునేందుకు తనను ఆదుకోవాలని వైశాలి గతంలో మోదీకి లేఖ రాసింది. ఆ లేఖకు స్పందించిన ఆయన శస్తచ్రికిత్స కోసం నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

Pages