S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/21/2016 - 18:06

దిల్లీ: దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇంటి ఎదుట రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బిజెపి ఎంపీ మహేష్ గిరి మంగళవారం వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో ఆయన యోగాసనాలు వేసి తన మద్దతుదారులతో ఆందోళన కొనసాగించారు. దిల్లీ పురపాలక మండలి అధికారి ఎంఎం ఖాన్ హత్యకేసులో తన ప్రమేయం ఉందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు నిరసనగా మహేష్ గిరి నిరాహార దీక్ష చేస్తున్నారు.

06/21/2016 - 18:05

చండీగఢ్: శారీరక వైకల్యం యోగాకు అడ్డుకాదని నిరూపించడమే గాక వికలాంగులు చక్రాల కుర్చీల్లో కదులుతూ అద్భుత యోగాసనాలను ప్రదర్శించారు. చండీగఢ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వందలాది మంది వికలాంగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా వికలాంగుల యోగా విన్యాసాలను చూసి అభినందించారు.

06/21/2016 - 18:00

ముంబయి : ముంబయిలోని థానే సెంట్రల్‌ జైల్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. 700 మంది ఖైదీలు యోగా సాధన చేశారు. ఖైదీలతో పాటు ఉన్నతాధికారులు, జైలు సిబ్బంది కూడా యోగా చేశారు. స్థానిక మానసిక ఆరోగ్య కేంద్రంలోని 100 మంది రోగులు, సిబ్బంది, సూపరింటెండెంట్‌ డా.రాజేంద్ర శిర్‌సత్‌ యోగాసనాలు వేశారు.

06/21/2016 - 17:15

హైదరాబాద్‌ : దక్షిణాది రాష్ర్టాల్లోనే బీరు విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో మందుబాబులు మొత్తం 334.56 లక్షల కేసుల బీర్లు గుటకాయస్వాహా చేశారు. సగటున మనిషికి 7.48 లీటర్ల బీరు విక్రయాలు జరిగాయి. కూల్‌ బీరును తాగడంలో కేరళ రెండో స్థానంలో నిలిచింది. కర్నాటక మూడో స్థానంలో నిలవగా, ఏపీ 2.72 లీటర్లతో నాలుగో స్థానంలో ఉంది.

06/21/2016 - 16:11

దిల్లీ: పునర్విభజన చట్టం పదో షెడ్యూల్‌లోని సంస్థలపై కేంద్ర హోంశాఖ మంగళవారం సమావేశం నిర్వహించింది. తెలంగాణ నుంచి కేఆర్‌కే రావు , ఏపీ నుంచి సీనియర్‌ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును మిగతా సంస్థలకు అన్వయించే అంశంపై చర్చించినట్లు సమాచారం.

06/21/2016 - 15:36

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం సుమారు 2 వేల మంది గర్భిణులు నిపుణుల పర్యవేక్షణలో యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. మరో 8వేల మంది చిన్నారులు మావన హారంలా ఏర్పడి మరో రికార్డు సృష్టించారని గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ వెల్లడించారు. రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లో 1.25కోట్ల మంది యోగా చేసినట్లు అంచనా.

06/21/2016 - 14:58

బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం మంగళవారం ఇక్కడ నిర్వహించిన యోగా దినోత్సవంలో బాలీవుడ్ నటి బిపాసా బసు పాల్గొని యోగసనాలు వేశారు. యోగాసనాలతో అందరినీ అలరించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంచి ఆరోగ్యం కోసం అందరూ యోగా నేర్చుకోవాలన్నారు. సిఎం సిద్ధరామయ్య, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తనకెంతో ఆనందం కలిగించిందని బిపాసా అన్నారు.

06/21/2016 - 14:51

దిల్లీ: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ను సిబిఐ అధికారులు మంగళవారం ఇక్కడ ప్రశ్నించారు. ఈ కేసులో వీరభద్ర సింగ్‌ను సిబిఐ ఇప్పటికే పలుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇపుడు కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.

06/21/2016 - 14:51

దిల్లీ: ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన 22 ఏళ్ల యువతి ఇక్కడి హర్ష్‌విహార్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకుని మరణించినట్లు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు. ప్రేమిస్తున్నానని వెంటబడిన ప్రియుడే ఆమెను గత నెలలో ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు. ఆ సమయంలోనే ప్రియుడితో పాటు అతని స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

06/21/2016 - 14:50

బెంగళూరు: ఓ పాఠశాల వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో 8 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, పదిమంది పిల్లలు గాయపడ్డారు. మంగళూరు సమీపంలోని కుందాపూర్ వద్ద ఈ ఘోరం జరిగింది. క్రాసిలోని డాన్‌బాస్కో పాఠశాలకు చెందిన పిల్లలు స్కూల్ వ్యాన్‌లో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

Pages