S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/21/2016 - 13:58

యానాం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారి యానాం విచ్చేసిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రివర్గ సభ్యులు కృష్ణారావు, నమశివాయన్‌, కందస్వామి, షాజహాన్‌, కమలకన్నణ్‌ బృందానికి మంగళవారం ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.

06/21/2016 - 13:51

ముంబయి: భారీ వర్షాలతో ముంబయిలో లోకల్‌ రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీరు నిలిచి సెంట్రల్‌, హార్బర్‌ మార్గాల్లో , మన్‌ఖుర్ద్‌, విద్యావిహార్‌, థానే, విక్రోలి భాందూప్‌ సీఆర్‌ మెయిన్‌, హార్బర్‌ లైన్‌ రైలు సర్వీసులపై ప్రభావం పడినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైళ్ల ఆలస్యం కారణంగా ప్రయాణికులు స్టేషన్లలో చిక్కుకుపోయారు. ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు సమయానికి వెళ్లలేకపోయారు.

06/21/2016 - 12:47

చండీగఢ్: యోగా అత్యుత్తమమైన జీవన విధానమని, దీని వల్ల వ్యక్తిగత, సామాజిక, మానసిక ఆరోగ్యం సాధ్యపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇక్కడ జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అన్నారు. భారతీయ సంస్కృతిలో ఒక భాగమైన యోగాను నేడు ప్రపంచ దేశాలన్నీ ఆదర్శంగా తీసుకుంటున్నాయని, ఈ కారణంగానే ఐక్యరాజ్య సమితి ఏటా జూన్ 21న ‘యోగా డే’ జరపాలని పిలుపునిచ్చిందని ఆయన గుర్తు చేశారు.

06/21/2016 - 11:36

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఉన్నతవిద్యామండలి ఆస్తులను, అప్పులను పంచుకోవాలని ఏపీ వాదిస్తోంది. దీనికి తెలంగాణ అంగీకరించడం లేదు. దీంతో షెడ్యూల్ 9,10 సంస్థల విభజన పంచాయతీ కేంద్రం వద్దకు చేరింది. వివరాలతో ఢిల్లీకి రావాల్సిందిగా ఇరు రాష్ట్రాల అధికారులను కేంద్రం ఆదేశించింది.

06/21/2016 - 11:27

న్యూఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదంపై కృష్ణా యాజమాన్య బోర్డు ఢిల్లీలో సమావేశమైంది. కృష్ణా నదీజలాలకు సంబంధించి నీటి యాజమాన్యం కృష్ణా రివర్ బోర్డు పరిధిలో ఉండాలని ఏపీ వాదిస్తుండగా, వాటాలు తేలకుండానే బోర్డు అధికారాలు ఎలా నిర్ణయిస్తారని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ, తెలంగాణ సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

06/21/2016 - 07:20

న్యూఢిల్లీ/ కోల్‌కతా, జూన్ 20:కేంద్ర ప్రభుత్వం తాజా గా ప్రకటించిన రెండో దశ ఆర్థిక సంస్కరణల విధానంపై ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, సిపిఎంలు తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డాయి. కేంద్రం చేపట్టిన సంస్కరణలు ప్రజా విశ్వాసానికి తీవ్ర విఘాతం కలిగించేవేనని, నమ్మక ద్రోహమని స్వదేశీ జాగరణ్ మంచ్ ధ్వజమెత్తింది.

06/21/2016 - 07:20

విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా
అనూహ్య స్థాయిలో ఆర్థిక సంస్కరణలు
రక్షణ, పౌర విమానయానానికీ అడ్డులేదు
సానుకూలంగా మార్కెట్ల స్పందన

‘రెండో దశ సంస్కరణలకు నాంది పలికాం. ఉపాధి, ఉద్యోగ
అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఇక దేశంలో వ్యాపారం మరింత సులభం’

06/21/2016 - 06:49

చండీగఢ్, జూన్ 20: రెండో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకోవటానికి దేశం పూర్తిగా సన్నద్ధమైంది. చండీగఢ్‌లో ప్రధాని నేతృత్వంలో ప్రధాన కార్యక్రమం జరుగుతుండగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒక పర్వదినంగా, పండుగగా జరుపుకోబోతోంది. ముఖ్య కార్యక్రమానికి చండీగఢ్‌లో భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

06/21/2016 - 06:47

న్యూఢిల్లీ, జూన్ 20: కొద్దిరోజుల పర్యటన నిమిత్తం విదేశానికి వెళ్తున్నానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. అయితే ఏ దేశానికి వెళ్తున్నదీ ఆయన స్పష్టం చేయలేదు. ‘కొద్ది రోజుల పర్యటన నిమిత్తం దేశాన్ని వీడి వెళ్తున్నా. 46వ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం నాకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.

06/21/2016 - 06:46

న్యూఢిల్లీ, జూన్ 20: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి పార్టీ అధిష్ఠానం రాజీనామా తీసుకుందని ఢిల్లీలో జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. గత వారం ఆయన ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలుసుకున్న విషయం తెలిసిందే.

Pages